Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

మీకు మే లొనరించెద” నని యమ్మత్స్యంబు సనియె; వైవస్వతుండును దదుక్త
ప్రకారంబున నోడ నిర్మించి, సకలబీజంబులు సంగ్రహించి, సప్తమునిసహితం
బుగాఁ గృతారోహణుండై పయోధిఁ దఱియం దొడంగె నంత.

⁠ 225


మ.⁠

మతి వైవస్వతుచేఁ దలంపఁబడి యమ్మత్స్యంబు దోఁతెంచె నా
యతశృంగోన్నతమూర్తి; నాతఁడుఁ దదాజ్ఞాయత్తుఁడై తచ్ఛిరో
గతశృంగాగ్రము[1]నం దగిల్చె నతిదీర్ఘం బైనపాశంబు; న
ద్భుతవేగంబున నోడ నీడ్చె నది యంభోరాశిమధ్యంబునన్.

⁠ 226


వ.⁠

తదనంతరంబ.

⁠ 227


సీ.⁠

గరుసులు గడవంగఁ [2]గదలి యల్లల్లన
                 యొత్తుచు నెడముల నుత్తరించి,
వేడుకఁ జేతులు వీచి యాడెడునట్లు
                 లోలోర్మిపంక్తులఁ గ్రాలి క్రాలి,
ప్రమదహాసస్ఫూర్తి పచరించువిధమున
                 నురుఫేనరోచులఁ దెరలు గలిగి
యురువడి వర్ధిల్లుచున్న జలంబుచేఁ
                 బొంగారి దెస లెల్ల మ్రింగికొనుచుఁ

⁠


ఆ.⁠

బ్రబలవిలయకాలపటురయబహుళస
మీరణౌఘదుర్నివార మగుచు
నుగ్రభంగిగాఁ బయోనిధు లొక్కటఁ
బెల్లు రేఁగి జగము వెల్లి వొడిచె.

⁠ 228


వ.⁠

ఇట్లు లోకం బెల్ల నేకార్ణవం బైన, నమ్మత్స్యంబు దజ్జలాంతరంబున ననేకసహస్ర
వర్షంబు లయ్యోడం [3]దిగుచుచు బదంపడి యప్పెనువెల్లి యల్లనల్లఁ దిగిచి
పోవం దొడంగునెడం దుహినగిరిశృంగసమీపంబున నయ్యోడ నిలిపి వార
లతోడ.

⁠ 229


తే.⁠

“ఈ నగంబు శృంగంబున నిపుడు మీరు
గట్టుఁ డియ్యోడ” ననిన నాక్షణమ వారు
నట్ల చేసిరి; విను మమ్మహాద్రిశృంగ
మనఘ! నౌబంధనం [4]బన నవనిఁ బరగె.

⁠ 230


క.⁠

మనుసహితులైన మునులం
గనుఁగొని యమ్మీను గరము గారవమున ని
ట్లనుఁ “బ్రళయంబున కీడునఁ
జనకుండఁగ మీకు రక్ష సలిపితిఁ గరుణన్.

⁠ 231


క.⁠

మునులార! యేను విశ్వం
బునకుఁ [5]బరమకర్త యగుప్రభుఁడ; వాత్సల్యం
బున మత్స్యమైన రూపం
బున నిమ్మెయి నిన్నిచందములఁ జనవలసెన్.

⁠ 232


వ.⁠

మీరు నిర్భయులరై చరియించునది; మఱియు నిమ్మనువును సదేవాసురమా
నుషంబైన జగం బఖిలంబును సృజియించు; మత్ప్రసాదంబున నతనికిఁ బరమ
జ్ఞానోదయం బగు”నని చెప్పి యయ్యాదిమత్స్యం బదృశ్యం బయ్యె; వైవస్వ
తుండును మఱియు నధికతపంబు సేసి సకలచరాచరంబుల సృజియించె.

⁠ 233


క.⁠

పరమం బగువైవస్వతు
చరితం బతిభక్తి వినినఁ జదివినను మహా
దురితంబు లడఁగు, జనులకు
నిరవుగ సిద్ధించు ననఘ! యిహపరసుఖముల్.”

⁠ 234


వ.⁠

అనిన నమ్మేదినీశ్వరుం డమ్మునీశ్వరునకుఁ బ్రణతుండై యి ట్లనియె.

⁠ 235
  1. ↑ నందు నిల్పె నతి
  2. ↑ గెరలి ... యాడెడుభంగి ... ప్రచురహాసస్ఫూర్తి ... చాడ్పున దిరుగుఫేనంబుల దిశలు ... బహుళస, మీర (స, ఘోర); స, మీరితౌఘదుర్ని ... జగము లెల్లఁ బొదివె
  3. ↑ ద్రిప్పుచుఁ
  4. ↑ బునా నవనిఁ బరఁగె
  5. ↑ బ్రథమకర్త