Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

[1]స్కరతేజుం బ్రభుఁ గాంచి సంజయుఁడు సంజాతప్రమోదాత్ముఁ డై.

⁠ 65


క.⁠

వనవాస[2]ము సేసియుఁ ద్రిభు
వనరాజ్యము సేయునట్టి వడువున సంతో
షనిబద్ధబుద్ధి యగు యమ
తనూజులకు భక్తి నెఱఁగి తా ని ట్లనియెన్.

⁠ 66


వ.⁠

“మిమ్మును, ధర్మార్థవిదుం డైన విదురునిం గౌరవేంద్రుం డెప్పుడుం దలంచుచుండు;
మీ యనుమతంబునఁ దనయనుజుం దోడ్కొని తేర నన్నుఁ బుత్తెంచె” ననిన విని
ధర్మరాజు విదురున కి ట్లనియె.

⁠ 67


తే.⁠

“[3]సర్వజనులును ధృతరాష్ట్రు శాసనంబు
సేయుచున్నచో మనకు విశేష భక్తిఁ
జేయవలయుఁ; గావున నెడసేయ కరుగు”
మనిన విదురుండు గజపురి కరిగె నంత.

⁠ 68


వ.⁠

ధృతరాష్ట్రుండును వినయవినమితోత్తమాంగు డైన విదురు నతిస్నేహంబునం
గౌఁగిలించుకొని [4]మూర్ధాఘ్రాణంబు సేసి “నీవు నిత్యక్షమానిరతుండవు; నా బుద్ధి
లేమికి క్షమియింపు” మనిన విదురుం డి ట్లనియె.

⁠ 69


ఆ.⁠

“నీవు, నీ సుతుండు నెఱిఁ దప్పి [5]పలికినఁ
బథ్య మయిన పలుక పలుకవలయు;
వీరు లయిన పాండవేయులతో నిగ్ర
హంబు సేయు టిది నయంబు గాదు.”

⁠ 70


వ.⁠

అనుచు నెప్పటియట్ల కార్యసహాయుం డై విదురుండు ధృతరాష్ట్రు నొద్ద యున్న
నయ్యిద్దఱ సంగమంబునకు శంకించి దుర్యోధనుండు కర్ణశకునిదుశ్శాసనులతో
ని ట్లనియె.

⁠ 71


క.⁠

“పాండవహితుఁ డగు విదురుఁడు
వెండియుఁ జనుదెంచి కార్యవిధులందు సహా
యుం డయ్యె; నతనితోడ హి
తుండయి మంతనము సేయఁ దొడఁగెన్ విభుఁడున్.

⁠ 72


వ.⁠

వీర లింకఁ బాండవుల నిందులకు రావించువార లయిన నగ్నివిషజలంబులు ప్ర
యోగించి వారల కపాయంబు సేయుద” మనిన విని శకుని దుర్యోధనుం జూచి “యి
ట్లేల బాలిశం బైనమతిఁ దలంచితివి; విదురధృతరాష్ట్రులు విపరీతమతులై రా
వించినను నిత్యసత్యనిరతులైన యప్పాండవులు దమ చేసినసమయంబు
సలుపక యేల వచ్చువా రగుదు” రనిన శకుని దుర్యోధనులకుఁ గర్ణుం డి ట్లనియె.

⁠ 73


ఉ.⁠

“ఇత్తఱిఁ బన్నిపోయి, పయి నెత్తి, రణం బొనరించి, వారలన్
మిత్తికి నంపి, ధాత్రి నిరమిత్రముఁ జేయుద; మిట్టులైనఁ ద
ద్వృత్తులు నీక దక్కుఁ; గురువీర కడంగుము” నావుడున్ మదో
న్మత్తుఁడు గౌరవుం డతని మాటకు సంతస మంది చెచ్చెరన్.

⁠ 74


వ.⁠

సమరసన్నద్ధుఁ డై సమస్తబలంబును సమకట్టి వెలువడినం దన దివ్యదృష్టి నం
తయు నెఱింగి కృష్ణద్వైపాయనుండు వచ్చి “యిది [6]ధర్మంబు గా; దుడుగు” మని
దుర్యోధనుని వారించి ధృతరాష్ట్రున కి ట్లనియె.

⁠ 75


క.⁠

“పుడమియు రాజ్యముఁ గోల్పడి
యడవుల నేకతను యున్న యప్పాండవులం

⁠
  1. ↑ స్వరతేజున్
  2. ↑ మయ్యు నిటఁ
  3. ↑ సకల...సేయుచోటను మనకు
  4. ↑ మూర్ధ్నఘ్రాణంబు
  5. ↑ యరిగినఁ
  6. ↑ ధర్మంబు గా దని దుర్యోధను