Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

క్కాలంబుం బటు మృత్యురోగభయశంకం బొంద మే [1]మెప్పుడున్.

⁠ 191


వ.⁠

ఇది యస్మదీయప్రభావమూలంబు; మీకుఁ బాతకభయంబు వలవ; దరుగుం”
డనినం దార్క్ష్యు వీడ్కొని హైహయులు నిజనివాసంబులకుం జనిరి; భరతవం
శోత్తమ! యిట్టిదియ బ్రాహ్మణప్రభావం” బని మఱియు మార్కండేయుండు “బ్రహ్మ
క్షత్త్రస్వరూపనిదర్శనం బయిన యొక్క యితిహాసంబు సెప్పెద విను” మని ధర్మ
రాజున కి ట్లనియె.

⁠ 192


చ.⁠

“వినుతచరిత్రుఁ డత్రి యను విప్రవరుండు తపంబొనర్పఁ గా
[2]ననమున కేఁగుచుండి తననాతిఁ గనుంగొని యిట్లనుం ‘దపం
బున కిదె యేను బూని వనభూమికిఁ బోవుచు నున్నవాఁడ నో
వనరుహనేత్ర! నీవు నట వచ్చెదొ? పుత్త్రులయొద్ద నుండెదో?’

⁠ 193


చ.⁠

అనుటయు భార్య యి ట్లనియె “నక్కట! పుత్త్రులకుం గుటుంబభా
వన యగు వృత్తి యెల్లను ధృవంబుగఁ జేయక, యాశ్రమాంతరం
బునకు మహాత్మ! నీకు [3]నిటు వోవుట ధర్మువు గాదు; వైన్యభూ
జనపతి యిచ్చునర్థులకుఁ జాలఁగ నర్థము; వేఁడు కువ్విభున్!”

⁠ 194


వ.⁠

అనినం గొండొక విచారించి, భార్య పలుకులు ధర్మయుక్తంబు లగుటకు [4]సంతో
షించి, యమ్మహాద్విజుం డప్పుడు చని యశ్వమేధాధ్వరదీక్షితుం డయి విప్రులకు న
పారధనంబు లిచ్చుచున్న వైన్యుం గని యాశీర్వాదపురస్సరంబుగా ని ట్లనియె.

⁠ 195


ఉ.⁠

“నీవ విధాత; వింద్రుఁడవు నీవ; సమస్తజనేశ్వరుండవున్
నీవ; యశేషధర్మములు నీవ యెఱుంగుదు; నిన్నుఁ బోలఁగా
నీ వసుధాతలంబున [5]మహీశ్వర యెవ్వరు లేరు; సన్మునీం
ద్రావలి యెప్డు నిన్నుఁ గొనియాడుఁ బరిస్ఫుటవాక్యభంగులన్.”

⁠ 196


చ.⁠

అని పలుకంగ గౌతమమహాముని యచ్చటనుండి యంతయున్
విని కలుషించి “యేల యిటు [6]వీఁకను నో రఱువంగఁ బ్రేలె? దీ
జనపతియే విధాతయును శక్రుఁడు నీశుఁడు? నర్థకాంక్షి వై
మనమున శంకలేక యొకమానవు నింత నుతింప నేటికిన్?”

⁠ 197

అత్రిగౌతములపరస్పరసంవాదము

వ.⁠

అనుటయు నత్రి యి ట్లనియె.

⁠ 198


ఉ.⁠

“ఊఱక మీఱ నాడెదవు; యుక్త మయుక్తము నాత్మఁజూడఁగా
నేరవు; సర్వలోకముల నిర్మలనీతిపరాక్రమంబు లొ
ప్పారఁగ నేలి ధర్మముల కన్నిటికిం గుదు రై వెలుంగు ధా
త్రీరమణుండు; మేటిగ నుతింపఁగ వోలదె నాకు [7]నిమ్మెయిన్.”

⁠ 199
  1. ↑ మిమ్ములన్
  2. ↑ వనమున ... తనవల్లభఁ గన్గొని ...బున కిపు డేను
  3. ↑ నటు
  4. ↑ సంతసిల్లి
  5. ↑ మహీశ్వరు లెవ్వరు
  6. ↑ వీఁకున నో (రెరుసంగఁ) రెఱుగంగఁ
  7. ↑ నెమ్మెయిన్