Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కండేయుఁడు ధర్మజునకు బ్రాహ్మణప్రభావంబు సెప్పుట

వ.⁠

అనిన విని ధర్మనందనుండు “బ్రాహ్మణప్రభావంబు వినవలతుం జెప్పవే” యనిన
మార్కండేయుం డిట్లని చెప్పెఁ “దొల్లి హైహయవంశోద్భవుం డైన ధుంధుమా
రుం డను కుమారుండు మృగయాసక్తుం డై వనంబునఁ గ్రుమ్మరువాఁ
డొక్కయెడం దృణలతాగుల్మమధ్యంబునం గృష్ణాజినోత్తరీయుం డయి యు
న్నవాని, నొకవిప్రు దవ్వులం గని మృగం బను బుద్ధిం జేసి బాణం బేసి డాయం
జని [1]నిజశిరచ్ఛిన్నుం డయినయతనిం జూచి యత్యంతదుఃఖితుం డయి, పురంబు
నకుం బోయి, నిజవంశవృద్ధు లైనహైహయుల కంతవృత్తాంతబునుం జెప్పి,
వారిం దోడ్కొని వచ్చి యవ్విప్రకళేబరంబు సూపిన.

⁠ 182


తే.⁠

వారలందఱు వందురి వగచి, యచటి
కతిసమీపంబునను దార్క్ష్యుఁ డనుమునీంద్రు
నాశ్రమం బున్న నయ్యెడ కరిగి, కనిరి
దేవమునిసిద్ధలోకప్రతీక్ష్యుఁ దార్క్ష్యు.

⁠ 183


క.⁠

కని భక్తి మ్రొక్కుటయు న
య్యనఘుఁడు దీవించి వారి కర్హ మ్మగు పూ
జనము లొనరింపఁ బంచెం
దనశిష్యులఁ బరమ[2]సంశ్రితపరుండు దయన్.

⁠ 184


వ.⁠

హైహయులు నమ్మునీంద్రునకు సాష్టాంగదండప్రణామంబు సేసి “మహాత్మా!
యిక్కుమారుండు మృగయాసక్తుం డై వచ్చి యింతకు మున్ను యివ్వనంబున
నొక్కబ్రాహ్మణు, గృష్ణాజినసంవృతు, నతిశ్రాంతుం బాపంబునం జేసి మృగం
బను బుద్ధి నేసిన నతండు మృతుం డయ్యె; నేము మహాపాతకదూషితుల మైతి
మి; గావున మీచేయు సత్కారంబుల కర్హులము గా; మిప్పాపంబున కెయ్యది ని
ష్కృతి? యనిన నవ్వుచు దార్క్ష్యుం డి ట్లనియె.

⁠ 185


క.⁠

“వినుఁ డెన్నఁడు మాయాశ్రమ
మున నెవ్వారలకు లేవు భూరిభయవ్యా
ధినిరోధమృత్యు[3]దోషా
ద్యనేకదుఃఖములు త్రిజగదాశ్చర్యముగన్.”

⁠ 186


వ.⁠

[4]అని పలికి దనపుత్త్రు నధికతపోబలసమన్వితుం జూపి.

⁠ 187


క.⁠

“ఈతఁ డగునె మీబాలకు
చేత నిహతుఁ డైనవాఁడు సెప్పుఁ” డనుడు వా
రాతఁడ తమమును చూచిన
యాతం డగుటకు మహాద్భుతాత్మకు లగుచున్.

⁠ 188


క.⁠

“మృతుఁ డయి క్రమ్మఱ సంజీ
వితుఁ డయ్యె నితండు; కరము విస్మయ మిది; భూ
నుత! యిట్టి మహిమ కలిమికి
గత మెయ్యది? యానతిమ్ము [5]కారుణ్యనిధీ!”

⁠ 189


వ.⁠

అని యడిగినఁ దార్క్ష్యుం డి ట్లనియె.

⁠ 190


శా.⁠

“ఆలస్యం బొకయింతలేదు; శుచి యాహారంబు; నిత్యక్రియా
జాలం బేమఱ; మర్చనీయు లతిథుల్; సత్యంబ పల్కంబడున్;
మేలౌ శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తు; మిట్లౌట నె

⁠
  1. ↑ నిశ్చేష్టతనుం డైన; నిశ్చేతనుం డయిన
  2. ↑ సంశ్రితవ్రతుఁడు దగన్
  3. ↑ రాగా, ద్యనేకదోషములు
  4. ↑ ఈవచనముతోఁ గలిపి పైపద్యభావము వచనముగా నొకానొకప్రతిఁ గానఁబడుచున్నది.
  5. ↑ కారుణ్యమునన్