ఇంతయు నెఱింగింప నీవ యర్హుండ” వనినఁ బరమజ్ఞాననిధి యైన యత్తపోనిధి
యతని కి ట్లనియెఁ “దొల్లి విధాత ప్రథమకల్పంబున నత్యంతనిర్మలంబులును
ధర్మతంత్రంబులును నైనశరీరంబులు సృజియించె; నట్లు పుట్టింపఁబడిన యామను
ష్యులు మహాసత్త్వసంపన్నులు, సత్యవాదులు, సత్యసంకల్పులు, బ్రహ్మభూతా
త్ములు, స్వచ్ఛందజీవులు నై దేవయానంబుల విహరించుచు, ననాయాసం
బున నధికఫలసిద్ధిం బొందుచు, సర్వజ్ఞులై, విగతమత్సరులై, బహుసహస్రసం
తానులై, బహుసహస్రసంవత్సరాయుష్యులై వర్తిల్లుచుండి; రంతఁ గాలాంతరంబు
నం గామక్రోధాదిగుణంబులు దమ్ముం బొందుటయు మాయాప్రవర్తను లై
దేవతలచేత విడువంబడి యల్పాయువులు, నల్పబలశరీరసత్త్వులును, దరిద్రు
లును, నిష్ఫలారంభులును, బహురోగపీడితులును, నాస్తికులును నై యొండొ
రుల మెచ్చక దురితంబులు సేయుచుఁ, దిర్యగ్యోనులం బుట్టుచు, నరకాగ్నులం
[4]గ్రాఁచుచు గతాగతభ్రమణంబుల నలయం దొడంగి; రిట్లు దిరుగుచున్న