Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

బొల్లమిఁ గౌరవాధముల[1]యుద్ధతి యమ్మెయిఁ జెల్లెఁగాక; యొం
డెల్లను నేల? నీదుమది నించుక కిన్క జనించినన్ మహీ
వల్లభ; యప్డ రూ పఱదె? వారక వైరికులంబు సర్వమున్.

⁠ 158


చ.⁠

వినుతభవ[2]న్నియోగ మను వేల యలంఘ్యము గాన యిమ్మెయిన్
ఘనభుజవీచివిభ్రమవికాసముఁ జూపక నిల్చెఁగాక; స
జ్జననుత! చూడ నీ యనుజసాగరముల్ దఱితోడ విద్విష
జ్జనలయకారు లై కడఁగి సర్వజగంబుల నాక్రమింపవే?

⁠ 159


ఉ.⁠

అంధకవృష్ణిభోజకుకురాన్వయభూపతు లెల్ల నీదెసన్
బాంధవసౌహృదయప్రణయభక్తివిశేషము లొప్ప, నీ మనో
గ్రంధి యడంగఁ జేయ నెసకంబునఁ బూనినవారు; లోభమో
హాంధులు ధార్తరాష్ట్రులు జనాధిప! మార్కొనువారె వారలన్?

⁠ 160


క.⁠

చతురంభోధిపరీత
క్షితితలసామ్రాజ్యలక్ష్మికిం బతివి జగ
నున్నత! [3]నీవ; నీవు దలఁచిన
నతిదుష్కర మెందు లే దనర్గళమహిమన్.”

⁠ 161


వ.⁠

అనిన సంతసిల్లి కుంతీనందనుండు దేవకీనందనుతోడ “దేవా! యెవ్విధంబున
నైన నల్పావశిష్టం బైనయివ్వనవాసకాలంబును నజ్ఞాతవర్తనంబును [4]దీర్చి లోకనిం
ద్యంబు గానివిక్రమంబునం బగఱ జయింపఁ గోరెదము; దీని నంతయు నిర్వ
హించు భారంబు నీయదియ; నీశరణంబు సొచ్చిన మాకుం బరమశోభనంబులును
సులభంబు లగట నిశ్చయంబు గాదె” యనియె నప్పుడు కృష్ణుండు నిజసమీ
పంబున నున్న పాంచాలిం జూచి యి ట్లనియె.

⁠ 162


సీ.⁠

“నీ పుత్త్రు లేవురు నీరజలోచన
                 యదుకుమారులుఁ దారు ముదముతోడ
ననుపసస్నేహసమాహితహృదయులై,
                 కరిహయారోహణ[5]పరతఁ దగిలి
యాడుచు, వివిధ శస్త్రాస్త్ర ప్రయోగముల్
                 గఱచుచు, నొం డెల్ల మఱచి యున్న
వారు; ప్రద్యుమ్నుండు వారికి దివ్యాస్త్ర
                 జాతంబు లెల్లను బ్రీతినొసఁగెఁ;

⁠


ఆ.⁠

దన్వి యాసుభద్ర తనపుత్త్రుకంటె నీ
తనయులందుఁ గూర్మిఁ దనరఁజేయు;
నూఱడిల్లు మింక నుజ్జ్వలోన్నతులఁ బెం
పారఁ గాల మనతి దూరమయ్యె.”

⁠ 163

మార్కండేయుం డనుమహాముని పాండవులయొద్దకు వచ్చుట

వ.⁠

అని యాశ్వాసించుసమయంబునం బరమతపోవృద్ధుం డయినమార్కండేయుం
డు సనుదెంచినం గృష్ణుండును బాండవులు నతని నెదుర్కొని యథోక్తవిధులం
బూజించిరి; మునీంద్రుఁడును వారిని బ్రత్యేకంబ కుశలంబు లడిగెఁ; దదనంతరం
బ యందఱు నాసీనులై యున్నయెడఁ బాండవహితార్థి యై వనజోదరుం

⁠
  1. ↑ యుద్ధతి (యామెయిఁ) మై మెయి
  2. ↑ న్నిదేశ ... యిమ్మెయిన్ ... కారు లై కడఁగి సర్వజగంబుల నాక్ర(మింపఁగన్) మింపవే
  3. ↑ నీవ నీ తలంచిన ... మొండు లే; నీ కవనితలంబున
  4. ↑ జల్పి ... బరమశోభనంబు లగుట
  5. ↑ చరితఁ