Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

తరతరుతతి కాప్యాయన
కరమై వర్షాగమంబు గడు బెడఁ గయ్యెన్.

⁠ 134


క.⁠

నాలుగు [1]వలఁకుల నవఘన
జాలంబులు వ్రేలి కురిసె ఝంఝానిలవే
గాలోలము లై బహుల
స్ధూలపయోధార లోలిఁ దుములంబులు గాన్.

⁠ 135


క.⁠

ఘనతరనైశతమం బొకొ
యనఁగ [2]ఘనాఘనతమిస్ర మవికలమై క
ప్పిన జనులకు వస్తువిభా
వన మొక్కొకయెడలఁ గలిగె వైద్యుతరుచులన్.

⁠ 136


చ.⁠

[3]అరుదగు తత్పయోదసమయంబున నొక్కట విస్తరిల్లె నం
బరమున నంబుదధ్వనియుఁ, బల్వలభూముల భూరిదర్దురో
త్కరరవముల్, మహీరుహశిఖాంతములందు శిఖండితాండవాం
తరమదమంజులస్వనము దా నతిరమ్యము లై వనంబునన్.

⁠ 137


చ.⁠

దళితనవీనకందళకదంబకదంబకకేతకీరజో
మిళిత[4]సుగంధబంధురసమీరణుఁడన్ సఖుఁ డూఁచుచుండఁగా
నులియుచుఁ బువ్వుగుత్తులను నుయ్యెల లొప్పుగ నెక్కి యూఁగె మ
ల్లలదళినీకులంబు మృదులధ్వనిగీతము విస్తరించుచున్.

⁠ 138


క.⁠

సురచాపచిత్రగగన
[5]స్ఫురణం బురుణించు నట్లు భూవనిత నిరం
తరచిత్రితయై యొప్పెను
సురుచి నవతృణశిలీంద్రసురగోపములన్.

⁠ 139


వ.⁠

తత్సమయానంతరంబున.

⁠ 140


ఉ.⁠

భూసతికిం దివంబునకుఁ బొ ల్పెసఁగంగ శరత్సమాగమం
బాసకలప్రమోదకర మై విలసిల్లె మహర్షిమండలో
[6]పాసితరాజహంసగతిభాసి ప్రసన్నసరస్వతీక మ
బ్జాసనశోభితం బగుచు నబ్జజుయానముతో సమాన మై.

⁠ 141


ఉ.⁠

శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె, వికసన్నవకైరవగంధబంధురో
దారసమీరసౌరభము దాల్చి, సుధాంశు[7]వికీర్యమాణక
ర్పూరపరాగపాండురుచిపూరములం బరిపూరితంబు లై.

⁠ 142

నన్నయభట్ట కవిత్వము సంపూర్ణము

ఇక్కడ నుండి యెఱ్ఱాప్రెగ్గడ కవిత్వము

చ.⁠

స్ఫురదరుణాంశు[8]రాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
వరణము లై, దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతరహంససారమధువ్రతస్వనముల్ సెలంగఁగాఁ

⁠
  1. ↑ కెలఁకుల
  2. ↑ ఘనాఘనతమిశ్ర మవిరళ మై
  3. ↑ అరుదుగ ... శిఖండములందు శిఖండి ... ము దారతరం బగుచున్ వనంబునన్.
  4. ↑ సుగంధిబంధుర
  5. ↑ స్ఫురణ విడంబించు
  6. ↑ ద్భాసిత
  7. ↑ విసార్యమాణ ... పూత సర్వదిగందరంబు లై; పూతములం బరిపూరితంబు లై
  8. ↑ రాగమునఁ బొంది