Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మరాజు నహుషప్రశ్నంబులకుఁ బ్రత్యుత్తరంబు లిచ్చుట

వ.⁠

అయినను నానేర్చు విధంబునం జెప్పెద నడుగు” మనిన నజగరం బి ట్లనియె.

⁠ 126


ఆ.⁠

“ఘనుఁడ! యేగుణములు గలవాఁడు బ్రాహ్మణుం?
డతని కెఱుఁగఁదగినయట్టివస్తు
[1]వెద్ది? దీని నాకు నెఱిఁగింపు” మనిన ని
ట్లనుచుఁ జెప్పెఁ బాండవాగ్రజుండు.

⁠ 127


సీ.⁠

“సత్యక్షమా[2]దమశౌచదయాతపో
                 దాన శీలంబు లెందేనిఁ గాన
నగు, నట్టివాఁడు బ్రాహ్మణుఁడు; సుఖంబు దుః
                 ఖంబునై నెడ విమోహంబు నొంద
కునికియ వానికి నుత్తమం బగు విద్య;”
                 యనిన “నీ చెప్పిన గుణము లివియు
క్రియ శూద్రునందుఁ గల్గిన నతం డుత్తమ
                 ద్విజుఁడు గా నేర్చునే? నిజము విడిచి

⁠


ఆ.⁠

నట్టులయిన బ్రాహ్మణాదివర్ణవిభాగ
మెట్లు గలుగునయ్య; హీను లధికు
లను వివేక మది యపార్థకం బగుఁ గాదె?”
యనిన ననియె నంతకాత్మజుండు.

⁠ 128


వ.⁠

“ప్రమాదంబున వర్ణసంకరం బయినప్పుడు వర్ణపరీక్షార్థంబుగా బ్రాహ్మణాదులకు
వృత్తంబు వేఱువేఱ స్వాయంభువుం డైనమనువు సెప్పె; సత్యాదిగుణంబులు
శూద్రునందుఁ గలిగినేని వాఁడు సచ్ఛూద్రుం డగుఁగాక బ్రాహ్మణుండు గా
నేర్చునే? యవియు బ్రాహ్మణునందు లేనినాఁడు శూద్రుండ యనంబడుం;
గావున వృత్తంబుల యుత్తమంబులు.

⁠ 129


తే.⁠

విత్తహీనుండు వెండియు వివిధగతుల
విత్తవంతుండు గా నేర్చు; వృత్తహీనుఁ
డైనవాడు విహీనుండ యండ్రు; గాన
విత్తరక్షకుఁ గడు మేలు వృత్తరక్ష.

⁠ 130


వ.⁠

అనిన నజగరం బి ట్లనియె.

⁠ 131


తే.⁠

“అప్రియం బొగిఁ జేసియు, ననృతవాది
యయ్యు, హింస గావింపని యమ్మహాత్ముఁ
డేఁగు సుగతికినం; డ్రది [3]యెట్లు? సెప్పు
మయ్య యనఘ! యహింస మేలైన తెఱఁగు.”

⁠ 132


వ.⁠

అనిన ధర్మతనయుం డి ట్లనియె “దానంబును, బ్రియంబుచేఁతయును, సత్యంబును,
నహింసయు ననునవి నాలుగును సమానంబుల; యయినను నహింసయ విశే
షం; బెట్లనిన దేవమనుష్యతిర్యగ్యోను లనియెడుమూఁడుగతులయందును మను
ష్యుండు దానాదిగుణంబులు గలిగి యహింసాపరుం డయిననాఁడు దేవగతి
వడయు; విపరీతవర్తనుం డయి తిర్యగ్యోనులం బొందు” నని యిట్లు తనచేసినప్రశ్నం
బులకు బ్రత్యుత్తరంబులు వలికినధర్మనందనున కతిప్రీతుం డై, భీమసేనుని విడిచి
శాపవిముక్తుం డై, దివ్యరూపంబు సేకొని యున్ననహుషుం జూచి ధర్మతన
యుండు సంతోసిల్లి యతనివలన నధ్యాత్మవిద్యారహస్యంబు నిమ్ముగా నెఱింగి, యుధి
ష్ఠిరుండు వృకోదరుం దోడ్కొని నిజాశ్రమంబునకు వచ్చి యున్నంత.

⁠ 133


క.⁠

ఖరకిరణతాపమున, నురు
తరదవదాహమున శోషితము లైనవనాం

⁠
  1. ↑ వెట్టి దిదియు నాకు ... ట్లనుచుఁ జెప్పె
  2. ↑ ధర్మశౌచ ... బ్రాహ్మణుఁడు సుఖంబు దుఃఖము నైనయెడ విమోహమును ... మనిన నీ చెప్పినగొనము లివియు ... వర్ణవిభేద, మేల కలుగునయ్య
  3. ↑ యె ట్లహింస, యనఘ యింతవిశేష మెట్లయ్యెఁ జెపుమ