Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

రాక్షసపిశాచపన్నగగంధర్వరూపంబు లుద్భవిల్లి యసురుల నెల్ల విగతాసులం
జేసిన.

⁠ 85


క.⁠

వంచన యనుమాయయు మా
యించి పరాక్రాంతి, నయ్యుమేశాస్త్రమునం
గ్రంచఱ నంతకుపురి కేఁ
గించితిఁ బౌలోమకాలకేయాసురులన్.

⁠ 86


వ.⁠

ఇట్లు హిరణ్యపురనివాసులం గృతాంతపునివాసులం జేసి వచ్చి, వాసవునకు
మ్రొక్కిన వాసవుండును నివాతకవచపౌలోమకాలకేయ[1]వధప్రపంచంబు
మాతలివలన విని సంతోసిల్లి నా కి ట్లనియె.

⁠ 87


చ.⁠

“సురలకుఁ బ్రీతి సేసితి; వసుంధర కేఁగుమ; నిన్ను నీసహో
దరులు నిరంతరంబును ముదంబునఁ జూడఁగఁ గోరుచున్నవా
రరిమదభేది! నీకు విషమాజిముఖంబున మార్కొనంగ నో
పరు నరు లెవ్వరున్; [2]హరినిభంబులు మార్కొనునయ్య యెయ్యెడన్.

⁠ 88


క.⁠

ద్రోణద్రోణజకృపగీ
ర్వాణనదీజాంగపతు లవశ్యమును భవ
[3]ద్బాణహతిఁ జేసి సమర
క్షోణిఁ బరిక్షీణబలు లగుదు రపజితు లై.”

⁠ 89


క.⁠

అనిన నమరేంద్రు వీడ్కొని
చనుదెంచితి” నని కిరీటి శతమఖలోకం
బునఁ దనచేసిన [4]విధ మ
త్యలఘుం డేర్పడఁగఁ జెప్పె నందఱు వినఁగన్.

⁠ 90


[5]వ.⁠

ధర్మరాజును దమ్ముఁడు సేసిన మహాపరాక్రమంబునకుఁ జతురంబోధిపర్యంతమ
హీరాజ్యం బప్పుడు తనకు సంప్రాప్తం బై నంతియ సంతోసిల్లి.

⁠ 91


ఆ.⁠

దివ్యబాణములు తదీయప్రయోగముల్
మాకుఁ జూపు మనిన మఘవసుతుఁడు
వేఱువేఱ చూపె వేలుపు లిచ్చిన
యస్త్రశస్త్రములు నిజాగ్రజునకు.

⁠ 92


వ.⁠

మఱియును.

⁠ 93


చ.⁠

సురవిశిఖప్రయోగములు సూపఁ [6]దొడంగిన నేల దిర్దిరం
దిరిగెఁ, బయోనిధుల్ గలఁగె, దిగ్గజముల్ మద మేది కుందె, భా
స్కరరుచి మాసెఁ, బావకశిఖాతతితోన యడంగె గాడ్పు, లం
బరమున నిల్చి రీశ్వరుఁడు బ్రహ్మయు నాదిగ వేల్పు లందఱున్.

⁠ 94


వ.⁠

అంత సురగణచోదితుం డైననారదుం డర్జునుపాలికి వచ్చి యి ట్లనియె.

⁠ 95


తే.⁠

“ఎదురు లేక దివ్యాస్త్రంబు లిట్లు నీకుఁ
బాడియే ప్రయోగింపంగఁ బాండుపుత్త్ర!
సిద్ధ మివి యధిష్ఠానవర్జితము లయ్యె
నేని మూఁడులోకములు దహించు[7]మాత్ర.”

⁠ 96


వ.⁠

అని యర్జును వారించి నారదుం డరిగిన నమరు లెల్ల నిజస్థానంబుల కరిగి; రిట్లు
పాండవు లందు పదిమాసంబు లుండునంత నొక్కనాఁ డమరకన్యకలు వచ్చి య
ర్జునున కి ట్లనిరి.

⁠ 97


తే.⁠

“వనమునందును బండ్రెండువత్సరమ్ము
లలయ కజ్ఞాత[8]చర్య యేకాబ్దకంబు

⁠
  1. ↑ వధప్రకారం బంతయు
  2. ↑ హరిశభంబులు
  3. ↑ ద్బాణతతిఁ
  4. ↑ తప మ
  5. ↑ ఇంకొకప్రతియం దీవచనము కానఁబడదు.
  6. ↑ గడంగిన ... మద మేది కుందె ... శిఖాతతి లోన నడంగె
  7. ↑ నొగిని
  8. ↑ చర్య కేకాబ్దకంబు; వాస మే; చర్యయం దబ్ద మొకటి