Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

ద్రిదశులకు బాధసేయుచుండుదురు; వారు
నిహతు లగుదురు; నీచేత మహితకీర్తి!”

⁠ 55


వ.⁠

అని తనతొడగిన యిద్దివ్యభూషణంబుల, నిమ్మణికిరీటంబున నన్ను విభూషితుం
జేసి, స్పర్శరూపం బైన యీయభేద్యకవచంబు నిచ్చి, యజగరసన్నిభం బయిన యిగ్గొ
నయంబు గాండీవంబు దాన యోజించి, పదివేలహంసమయూరవర్ణమాన
నీయహయంబుల బూనిన రథంబు, మాతలిప్రయుక్తం బైనదాని నెక్కం బనిచి,
నివాతకవచవధార్థం బరుగు మని నియోగించిన నింద్రు వీడ్కొని చనుచున్న
నాతో దేవత లి ట్లనిరి.

⁠ 56


ఉ.⁠

“ఈరథ మెక్కి [1]పోయి యమరేంద్రుఁ డనేకసహస్రసంఖ్య దే
వారుల, వృత్రశంబరబలాదుల, నుద్ధతులన్ జయించె; వీ
రారివిభేది! నీవును బలాఢ్యుఁడవై వధియింపు ముగ్రమా
యారతులన్, నివాతకవచాసురులన్ సమరాంతరంబునన్.”

⁠ 57


వ.⁠

అని నాకు దేవదత్తం బనుశంఖం బిచ్చిన నేనును మాతలి[2]ప్రయుక్తం బైన
రథం బెక్కి యతిత్వరితగతి నరిగి.

⁠ 58

అర్జునుఁడు నివాతకవచు లనురాక్షసుల జయించినకథ

క.⁠

ఫేనవదూర్మిచయంబుల,
నానావిధమీనకూర్మనక్రంబుల, శై
లానుకృతి నొప్పుచున్న మ
హానీరథిఁ గంటి నేను నమ్మాతలియున్.

⁠ 59


వ.⁠

ఆసముద్రోదరంబున విశాలాట్టాలక[3]ప్రతోళికాప్రతానవిచిత్రపతాకావివిధ
సాలాలంకృతం బైనపురంబుఁ గని, తద్ద్వారంబున శంఖధ్వానంబు సేసిన, నది
సకలదిఙ్మహీధరగుహాకుహరాంతరంబులం బ్రతిశబ్దజననం బయిన, దాని విని
యలిగి యద్దానవులు నానావిధాయుధసన్నద్ధు లయి నిజకాయకాళిమాంధ
తమోభూతభూభువను లగుచు వచ్చి నారథంబుఁ బరివేష్టించి.

⁠ 60


క.⁠

ఉరుశస్త్రవృష్టి నాపైఁ
గురిసినఁ, దత్క్షణమె యొక్కొకొనిపయి నేనున్
వరుసఁ బదినేసి బాణము
లరుదుగ నేసితి మహాభయంకర[4]వృత్తిన్.

⁠ 61


క.⁠

దనుజులు మదీయరథమా
ర్గనిరోధముగాఁ బ్రచండకాండప్రకరం
బునఁ గప్పిరి రోదోంతర,
మనిమిషులును ఋషులుఁ జూచి యద్భుతమందన్.

⁠ 62


క.⁠

కడుభయమున మాతలి చే
డ్పడి రథచోదనమునం దపాటవుఁ డైనన్
వడి నేన రథము గడపుచుఁ
దడయక యేసితిఁ గడంగి దానవులపయిన్.

⁠ 63


వ.⁠

మాతలి నన్నుం జూచి సంతోసిల్లె నంత.

⁠ 64


చ.⁠

అతులరణాంతరంబున నిరంతరమత్పటుబాణ[5]పాతితో
చ్ఛ్రితదనుజాంగనిర్గళదసృగ్జలధారలు సూడ నొప్పె, నా
తతగిరిశృంగసంగదళితప్రచలజ్జలవాహజాలసం

⁠
  1. ↑ తొల్లి
  2. ↑ సహితంబుగా రథం
  3. ↑ ప్రతోళికాలంకృతం బయిన ... నిజకాయనికాయకాళిమతమోభూతభువను
  4. ↑ భంగిన్
  5. ↑ దాదితో