| |
పాండవకౌరవులకు సమ్మతుండవు; చెప్పు మింక నప్పాండవు లేమి సేయువా”
రనిన విదురుం డి ట్లనియె.
| 45
|
| మత్తకోకిలము. |
“దేవమూర్తులు పాండుపుత్త్రులు ధీరచిత్తులు; వారి పెం
పీ వెఱుంగనివాఁడవే? ధరణీశ! వాయుసుతుండు గాం
డీవియున్ భుజవిక్రమప్రకటీకృతుల్, వివిధాస్త్రవి
ద్యావిశేషులు; వైరివీరులఁ దక్కనిత్తురె పోరులన్?
| 46
|
| క. |
మొనసి యధర్మద్యూతం
బున భేదము వుట్టుఁ బాండుపుత్త్రులకును నీ
తనయుల కని మును చెప్పిన
విన నొల్లక కొడుకుపలుకు వింటివి కడఁకన్.
| 47
|
| వ. |
ఇఁక నయినను వారి రావించి, తొల్లి నీచేతం బడయం బడిన రాజ్యంబునందుఁ
బ్రతిష్ఠించి, కీర్తియు ధర్మంబును నిలుపుము; రాజ్యంబును ద్రివర్గంబును ధర్మ
మూలంబులు; గావున నంద వర్తిల్లు; ధర్మువు విడిచి యధర్మవర్తి యయి కర్ణశకుని
దుశ్శాసనశిక్షితుం డైన దుర్యోధను దుశ్చేష్టితంబుల కొడంబడ వలవదు.
| 48
|
| తే. |
వీడు పుట్టిన పాపంపువేళఁ బెక్కు
దుర్నిమిత్తముల్ వుట్టిన నిర్ణయించి
యేను జెప్పితిఁ దొల్లియు [1]వీనిచేత
నెట్టుఁ గౌరవులకు నెగ్గు వుట్టు ననియు.
| 49
|
| వ. |
కులదూషకు దూషించి కులంబు రక్షించుట ధర్మువు; ధర్మరాజు నఖిలమహీ
రాజ్యరక్షకుం జేసి పుత్త్రపౌత్త్రమిత్రామాత్యబంధువర్గంబుల నెల్ల రక్షింపుము;
సభామధ్యంబునందు ద్రౌపదీభీమసేనులం బ్రార్థింప దుశ్శాసనుం బంపుము.
| 50
|
| చ. |
[2]అతిశయితామరోత్తముఁ, డహర్పతితేజుఁ, డజాతశత్రుఁ, డూ
ర్జితుఁ, డజితుండు నీసుతుల్ సేసిన యెగ్గు దలంపఁ; డాతనిన్
ధృతి నభిషిక్తుఁ జేయుము ప్రతీపకులోద్వహ! యిట్ల యైన నీ
కృతమునఁ గౌరవాన్వయ మకిల్బిషకీర్తిఁ బ్రకాశితం బగున్.”
| 51
|
| వ. |
అని పలికిన విదురు పలుకులు విని కడు నలిగి ధృతరాష్ట్రుం డి ట్లనియె.
| 52
|
| క. |
నాదేహంబునఁ బుట్టిన
యాదిసుతున్ విడువ నెట్టు లగు? నాత్మజులం
[3]గాదనక విఘాతించు ద
యాదూరులు గలరె? యిట్టు లన నీ కగునే?
| 53
|
విదురుఁడు ధృతరాష్ట్రుని విడిచి పాండవులయొద్దకుఁ బోవుట
| వ. |
నీవు నాకొడుకులయున్నతి కెన్నండు సహింపవు; నీసహాయత్వంబు నేనొల్లఁ; బాండ
వులకడకేనియు, నొండుగడకేనియు [4]నీకిష్టంబైన చోటికి నరుగు” మనిన నాక్షణం
బ విదురుండు మనోజవైకరథారూఢుం డై పాండవులకడకుం గామ్యకవనంబున
కరిగె; నంత నతనిరాక దవ్వులం గని ధర్మరాజు భీమసేనున కి ట్లనియె.
| 54
|
| సీ. |
“గాండీవ మాదిగాఁ గల యాయుధావలు
లుక్కివంబున నప్పు [5]డొడిచికొనఁగ
మఱచినవాఁ డయ్యు మందాత్ముఁ డాధార్త
రాష్ట్రుండు గాంధారరాజతనయు
|
|
- ↑ వీనిచేయి, నెట్టు
- ↑ అతిశయతాపసోత్తముఁ ... బ్రతీపకులోత్తమ యట్టులైన నీ, కతమునఁ ...మకల్మషకీర్తిఁ
- ↑ గా దని విభూతి నిచ్చు
- ↑ నీ కిష్టం బగునెడ కరుగుమనిన
- ↑ డొలిచికొనఁగ