| |
కాపురుషుండుఁబోలె నిజగర్వము దక్కి యడంగి యుండెఁ జిం
తాపరుఁ డై వృకోదరుఁడు దద్దయు లజ్జ నధోముఖంబుతోన్.
| 329
|
| వ. |
ఇ ట్లక్కపివరులాంగూలంబుఁ గదల్ప నోపక భీముండు కృతప్రణాముం డయి
“ని న్నెఱుంగక నాపలికిన దురుక్తంబులు సహింపవలయు; నీవు కపిరూపధరుండ
వైన సిద్ధుండవో, గంధర్వుండవో, దేవవరుండవో? నా కెఱింగింపు” మనిన హను
మంతుండు భీముం జూచి నగుచు, “నేను గేసరిక్షేత్రంబున వాయుభట్టారకునకుం
బుట్టినవాఁడ; నీచెప్పినహనుమంతుండ; నీవు నాయనుజుండవు; దొల్లి రఘుకులే
శ్వరుం డయిన రామదేవుండు రావణుం డనురాక్షసుచేత నపహృతభార్యుం డై
సుగ్రీవాదివానరుల నసంఖ్యాతసంఖ్యలవారిం దనకు సహాయులం జేసికొని,
సేతుబంధనంబున సముద్రంబు లంఘించి, సమరంబున రావణు వధియించి,
యందు [1]నాకెలసంబునకు మెచ్చి.
| 330
|
| మధ్యాక్కర. |
“నరసురస్తుత్యమై యెంతకాలంబు నాకీర్తి నిలుచు
నిరతంబుగా నంతకాలమున్ నీవు నిత్యుండ వగుచుఁ
బరఁగు” మని వరముఁ దగ దయంజేసి ప్రభుఁ డుర్వి యెల్ల
సరి పదునొక్కండువేల యేం డ్లేలి చనియెఁ దా దివికి.”
| 331
|
| వ. |
అనిన విని భీముండు వాని నప్పుడు హనుమంతుంగా నెఱింగి సంతసిల్లి, వెండియు
నమస్కరించి, “భవద్దర్శనంబునం గృతార్థుండ నయితి” నని యి ట్లనియె.
| 332
|
| ఆ. |
“బలిముఖుండ, దయయుఁ గలవేని దొల్లి య
ర్ణవము గడచి చనిన నాఁటి నీదు
రూపుఁ జూడవలతుఁ; జూపు నా” కనవుడు
వాని కిట్టు లనియె వానరుండు.
| 333
|
| క. |
“అక్కాలంబున రూపం
బిక్కాలంబునందుఁ జూప నెట్లగుఁ? గాలం
బొక్కవిధంబున నుండక,
పెక్కు[2]ప్రకారముల నుండు భిన్నావస్థన్.
| 334
|
| వ. |
దానంజేసి కృతత్రేతాద్వాపరకలియుగంబుల సంఖ్యలు వేఱువేఱ యై, యందుల
చరాచరభూతంబులు భిన్నప్రకారంబు లై వర్తిల్లు” ననిన “నయ్యైయుగంబుల
[3]యాచారభూచారరవర్తమానంబులు నా కేర్పడం జెప్పు” మనిన భీమునకు హను
మంతుం డి ట్లనియె.
| 335
|
భీమునకు హనుమంతుఁడు చతుర్యుగాచారవర్తనంబులను దెలుపుట
| తే. |
“కృతమకాని కర్తవ్యంబు గృతయుగంబు
నందు లేదు; చతుష్పాద మగుచు ధర్మ
మనఘ! వర్తిల్లు; నచ్యుతుం డయ్యుగమున
శుక్లవర్ణుఁ డై ప్రజలఁ గాచుచు వెలుంగు.
| 336
|
| వ. |
అదిసనాతనధర్మసనాథం; బందుల బ్రహ్మక్షత్త్రియవైశ్యశూద్రు లేకవేదక్రియా
యోగ్యులై, యకామఫలసంయోగంబునఁ బుణ్యలోకంబులు వడయుదు;
రందు నసూయాభిచారదర్ప పైశున విగ్రహక్రోధమదమత్సరభయసంతాప
వ్యాధిప్రజాక్షయేంద్రియక్షయంబులు లేవు; మఱియుఁ ద్రేతాయుగంబునందుఁ
|
|
- ↑ నాఖేలమునకు
- ↑ వికారములఁ బొందు; పదార్థములఁ బొందు
- ↑ యాచారప్రవర్తనంబులు