Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

చుచు, సింహంబు నెత్తి సింహంబు పై వైచుచు, నల్పమృగంబులం గరతలప్ర
హారంబులం బ్రహరించుచు.

⁠ 311

భీముఁడు సౌగంధికహరణార్థంబు పోవుట

సీ.⁠

గమనవేగంబున ద్రుమలతాజాలసం
                 చాలన సేయుచు, శైలగుహల
నడఁగి యదృశ్యులై కడువేడ్కతోఁ దన్నుఁ
                 జూచు ఖేచరసిద్ధసురభుజంగ
గరుడగంధర్వకిన్నరకామినులచేత
                 మానుగా నభివీక్ష్యమాణుఁ డగుచు
మ్రాఁకులు విఱుచుచు, వీఁకతోఁ దీవలఁ
                 బెఱుకుచుఁ, బదహతిఁ బృథునగేంద్ర

⁠


ఆ.⁠

మద్రువ నున్నతంబు లయి నెడ లెక్కుచు
మదగజంబువోలె మధ్యముండు
పవనవైనతేయపటుజవయుక్తుఁ డై
యరిగె గంధమాదనాంతరమున.

⁠ 312


వ.⁠

ఇ ట్లరుగువాఁడు నిజసింహనాదశ్రవణపరిత్రస్తంబులై యెగసి పఱచుపక్షుల
యార్ద్రపక్షంబులఁ జూచి, ముందట నాసన్నంబునం గొలను కలుగవలయు నని
యుపలక్షించి, యతిత్వరితగతిం జని చని, పవనవశ[1]సంచలితతరుహోపనసతమాల
తాలహింతాలవిశాలకదళీదళవీజ్యమానశీతలజలపరిపూర్ణం బైన యొక్కసరో
వరంబుఁ గని, యందుఁ గృతావగాహుం డై, నవనలినదళమృణాలవలయాలం
కృతు డగుచు దాని వెలువడి యనేకయోజనవిస్తారాయామరమణీయం బైన
కదళీషండంబుఁ జొచ్చి యందు శంఖధ్వానంబుఁ జేసిన.

⁠ 313


క.⁠

ఆశంఖరవంబు మహేం
ద్రాశనినిర్ఘోషభీమ మై దిక్కులు నా
కాశంబు నిండె నంత గు
హా[2]శయుఁ డై యున్న హనుమ యనుకపి పెలుచన్.

⁠ 314


క.⁠

దాని విని బెదరి లేచి “మ
హానాదం బిది మనఃప్రియం బయ్యె మదీ
యానుజుశంఖధ్వానము
దా నగు” నని యెఱిఁగి హృష్టతనురుహుఁ డగుచున్.

⁠ 315


వ.⁠

భీమునకు మార్గనిరోధంబుగా మహావృక్షంబు లురులం ద్రోచి [3]తదయనపథం
బున కడ్డంబుగా శయనించి లాంగూలలీలాచాలనంబుఁ జేసిన.

⁠ 316


క.⁠

గోలాంగూలోత్తము లాం
[4]గూలస్ఫోటనపవంబు ఘోరం బై వా
చాలతఁ జేసె నశేషమృ
గాని భయం బంద గిరిగుహాంతర మురులన్.

⁠ 317


వ.⁠

అయ్యపూర్వధ్వని విని భీముండు విస్మితుం డయి చని కదళీషండమధ్యంబున
నొక్కవిశాలశిలాతలంబుపయి శయనించినవాని.

⁠ 318


సీ.⁠

హ్రస్వపీనగ్రీవు, [5]నచలితాయతహను,
                 నతిచపలస్వభావాభిరాముఁ,
దనుమధ్యకటిచక్రు, దహనకణాకార
                 తామ్రోష్ఠు, నతికృశదశనకరజుఁ,
బృథులవిద్యుత్పుంజపింగాక్షు, నుత్తుంగ
                 దృఢవక్షు, నాజానుదీర్ఘబాహు,
నూర్ధ్వలాంగూల మత్యున్నతధ్వజలీలఁ
                 గ్రాలుచు నుండ నేకాంతయోగ

⁠
  1. ↑ పరిచలితతలీరుహపనసతమాల
  2. ↑ శయనుం డైనబనుమ
  3. ↑ యేకాయనపథం
  4. ↑ గూలాస్ఫాటన(స్ఫాలన) ... గిరిగుహాముఖములన్
  5. ↑ నవనతాయత ... కారు తామ్రాక్షు నతిదృఢదశనకరముఁ ... సింగాంగు ... దృఢవక్షు నక్షీణ