Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

సేనాదిభృత్యులను సుబాహునొద్దం బెట్టి పాదాచారులై పాంచాలిని, బ్రాహ్మణు
లను రక్షించికొని, గంధమాదనంబున కభిముఖులై యరిగి; రంత ధర్మతనయుం
డు భీమున కి ట్లనియె.

⁠ 289


సీ.⁠

“అలిగి వజ్రాయుధు నైనను బోరిలో
                 నోర్వంగ నోపు నత్యుగ్రవీరు
జపమునఁ బవనుఁ, దేజంబున నాదిత్యుఁ
                 బోలినవాని, నంభోజనేత్రు,
నాయతబహుఁ, గృతాస్త్రు, సింహస్కంధు,
                 సర్వధనుర్ధరాచార్యు, విజయు,
నిత్యక్షమాన్వితు, నీతమ్ము, నర్జును
                 శుభగుణసుందరుఁ జూచునంత

⁠


ఆ.⁠

కధికతాపతప్త మైనది నాచిత్త
మొనర నతనితోడ [1]నొక్క టునికి
యెన్నఁడొక్కొ మనకు నిందఱ కగు! నాతఁ
డేల మసలెనొక్కొ యిన్నియేండ్లు?”

⁠ 290


మ.⁠

అనుచుం బార్థవిలోకనంబు మదిలో నర్థింపఁగా ధర్మజుం
డనవద్యుల్ గడువేడ్కతో నరిగి తా రప్పాండవుల్ గంధమా
దనశైలేంద్రముఁ గాంచి రున్నతబృహద్ధాతుస్థలీసంహతిన్
ఘనసంధ్యాగమశంక సన్మునులకుం గావించు దానిన్ మహిన్.

⁠ 291


క.⁠

నానావర్ణశిలావిహ
గానేకమృగాభిరామ మై, భూనారీ
నానాభరణవిభూషిత
పీనోన్నత[2]కుచముఁ బోలె వెలిఁగెడు దానిన్.

⁠ 292

పాండవులు గంధమాదనపర్వతంబునకుం బోవుట

క.⁠

లలితాచ్ఛస్ఫటికశిలా
తలములపైఁ బాఱు విమలతరనిర్ఝరిణీ
జలపూరములను తారో
ల్లలదురుహారాలి నుజ్జ్వలం బగుదానిన్.

⁠ 293


ఉ.⁠

వారలు గంధమాదన మవార్యబలాఢ్యులు సొచ్చుచో మహా
మారుత మప్డు వీచె నహిమద్యుతిమార్గము, దిఙ్ముఖంబులన్
భూరుహపత్రమిశ్ర మయి భూరిపరాగము గప్పఁగా ధరి
త్రీరుహ[3]శాఖలున్ విఱిగి త్రెళ్ళఁగ, గుల్మలతాలి సాల్పడన్.

⁠ 294


చ.⁠

కడువడి గాడ్పుచే విఱుగఁగాఁ బడి త్రెళ్లు మహీరుహాళిచ
ప్పుడు విని యందఱుం జెదరి భూమిపయిన్ గగనం బు[4]దగ్రతం
బడియెనొ, శైలశృంగములు భగ్నము లయ్యెనొ, యంచు ధూళి నె
క్కడఁ జన నేర కొండొరులఁ గానక యుండిరి సంచలాత్ము లై.

⁠ 295


వ.⁠

ఇట్లు మహారేణుపటలం బంధకారంబునుం బోలె నీరంధ్రంబై కప్పినఁ, [5]దరువిట
పలతాగుల్మంబులు కరతలంబులం బాయం ద్రోచుచు, విశాలదృఢతరుమూలం
బు లాశ్రయించి, యగ్నిహోత్రంబులతో ధౌమ్యధర్మజసహదేవు లొక్కచోట,
నుద్యద్గదాకార్ముకుం డైన భీమసేనుండును, ద్రౌపదియు నొక్కచోట రోమశుం

⁠
  1. ↑ నొకట నునికి; నొప్పు నునికి
  2. ↑ భుజము వోలెఁ బొడఁగగుదానిన్
  3. ↑ శృంగముల్ ... సాల్వడన్
  4. ↑ డగ్గఱం ... యంచు దూలి యొక్కడ ... భీతచిత్తు లై
  5. ↑ బతితతరు