Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

సంకల్పజంబైన కామంబున దగిలిన మనస్సుచేతం [1]బ్రేరితంబై శ్రోత్రాదీంద్రి
యంబులు శబ్దాదివిషయంబులుం బరిభ్రమించుటం జేసి విషయాభిలాషవిశిఖవిద్
ధులై దేహులు తేజోలుబ్ధంబులైన శలభంబులుంబోలె శోకానలంబునం బడి త
మ్మెఱుంగక యవిద్యాకర్మతృష్ణలం జేసి సంసారచక్రంబునందుఁ బ్రవర్తిలుదు;
రట్టి బ్రహ్మాది తృణపర్యంత భూతప్రవృత్తియందు రాగద్వేషవిముక్తులై యభిమాన
మత్సరంబులు విడిచి వేదచోదితంబైన సమ్యక్సంకల్పసంబంధం, బింద్రియ
నిగ్రహంబు, వ్రతవిశేషంబు, గురుసేవనం, బాహారయోగం, బధ్యయనాగమంబు,
కర్మసన్న్యాసంబు, చిత్తనిరోధం బను నెనిమిదింటను గర్మానుష్ఠానంబు సేసిన
మహాత్ములు దమ తమ తపోమహత్త్వంబునం జేసి సంసారంబు జయింతురు;
నీవును శుశ్రూషా శ్రవణగ్రహణ ధారణోహాపోహార్థవిజ్ఞాన తత్త్వజ్ఞాన సమన్వితుం
డవు; నీచేతం బ్రారబ్ధంబు లైన యవి సర్వంబులును సంపన్నంబు లగు.

⁠ 33


క.⁠

వసురుద్రాదిత్యాదులు
వసుధేశ! [2]తపంబు గౌరవంబున నైశ్వ
ర్యసమృద్ధు లైరి; తపమునఁ
బ్రసిద్ధముగ నిష్టసిద్ధి వడయుము నీవున్.

⁠ 34


వ.⁠

తపస్సిద్ధు లైనవారు దమ తలంచినదానిన క్రమంబునం బడయుదురు; గావున నీవు
నుపశమవంతుండవై తపంబు సేసి [3]యోగార్థసిద్ధి వడసి బ్రాహ్మణుల ననుచ
రించుచు నీమనోరథంబు సఫలంబు సేయు” మనిన శౌనకు వచనంబు సేకొని భ్రాతృ
మధ్యగతుం డైన ధర్మతనయుండు ధౌమ్యునకు నమస్కరించి యి ట్లనియె.

⁠ 35


తే.⁠

“వనమునకు వచ్చి నవయంగ [4]వలవ దుడుగుఁ
డనిన నుడుగక మీతోన యరుగుదెంతు
మనిరి బ్రాహ్మణుల్; వీరి కాహార మేయు
పాయమున నుగ్రవనమునఁ బడయనేర్తు?

⁠ 36


వ.⁠

వీరల విడువ నోప; నేమి సేయుదు? ననిన విని ధౌమ్యుండు పెద్దయుం బ్రొద్దు [5]చిం
తించి ధర్మరాజున కి ట్లనియె.

⁠ 37


ఆ.⁠

“భూతరాశి దొల్లి పుట్టి బుభుక్షాభి
తప్త మయినఁ జూచి తద్భయంబు
నపనయింపఁ [6]గడఁగి యదితిసుతాగ్రణి
గమలబాంధవుండు గరుణతోడ.

⁠ 38


వ.⁠

ఉత్తరాయణగతుం డై యుర్వీరసంబు పరిగ్రహించి. దక్షిణాయనగతిం బర్జన్య
భూతుం డై యోషధులం బడసి. రాత్రులయందుఁ జంద్రకిరణామృతంబునం జేసి
వానిం దడుపుచు [7]వర్ధించి యం దన్నంబు వుట్టించి ప్రజారక్షణంబు సేయుటం
జేసి యన్నం బాదిత్యమయం బని యెఱింగి తొల్లి భీమవైన్యకార్తవీర్యనహు
షాదులు యోగసమాధిష్ఠితులై సూర్యభజనంబున నన్నంబుఁ బడసి యాపదల
వలనం బ్రజల సముద్ధరించిరి గావున.

⁠ 39
  1. ↑ భ్రాంతంబులయి ... తేజోలుబ్ధభస్మీభూతశలభం ... ధారణరుచివిజ్ఞాన ... సంబంధితుం డ ... బ్రారంభితం బైనయవి
  2. ↑ తపోబలంబువలన నైశ్య
  3. ↑ ఆత్మార్థసిద్ధులు వడసి బ్రాహ్మణుల భరియించి వారలకు మనోరథంబు
  4. ↑ వలవదుండుఁ, డనిన నుడుగుము మీతోన ... బడయవచ్చు
  5. ↑ విచారించి
  6. ↑ గణఁగి
  7. ↑ వర్తించి ... ప్రజాప్రాణధారణంబు ... భీమసేనకార్తవీర్య