| క. |
“అలఘు లగు వృద్ధవిద్వాం
సులకు మహాయాజ్ఞికులకుఁ జొర నర్హంబై
విలసిల్లు యజ్ఞసభ సొర
వలవదు; చనుఁ డీరు చిఱుతవారల” రనినన్.
| 247
|
| క. |
[1]అలయక యేండ్లు గడుం బె
క్కులు జీవించుట, నర గలుగుటయుం దగు వృ
ద్ధుల లక్షణమే? జ్ఞానము
గలఁ డేనిన్ బాలుఁ డయినఁ గడు వృద్ధు మహిన్.
| 248
|
| వ. |
[2]కృతాధ్యయనశీలుం డై యనూనాచారపరుం డైనవాఁడు బాలుం డయ్యును
సర్వజనసమ్మాననీయుం డగుసభాయోగ్యుండు; బాలు రని మమ్ము నవమానింప
వలవ; దేము జనకరాజసదనంబున దర్పితు లైనవేదవాదులతో వాదంబు సేయ
సమకట్టి వచ్చినవార” మనిన దౌవారికుండు వారి నప్పుడు రాజానుమతుం
డై లబ్ధప్రవేశుం జేసె నంత.
| 249
|
| సీ. |
జనకభూపాలుని సంప్రశ్నముల కెల్ల
నేర్పడ నుత్తరం బిచ్చిఁ, వాని
సభయందు భూసురసంఘమధ్యంబున
వరుణపుత్త్రుం డైన వందితోడ
వాదంబు చేసి, గర్వంబున నాతని
[3]నొడిచి, తద్విజితు లై యుదధి నున్న
ధరణీసురులఁ దన తండ్రి నిగ్రహ
ముక్తులఁ జేసి, సన్మునికుమారుఁ
|
|
| తే. |
డధికతేజుఁ డష్టావక్రుఁ డఖిలలోక
పూజితుం డైన జనకుచేఁ బూజ లంది
యేకపాదుఁ దోడ్కొని పేర్మి నేఁగుదెంచె
బుధనుతుండు నిజాశ్రమంబునకు నొప్ప.”
| 250
|
| వ. |
అని చెప్పుచు నరిగి “యిది సమంగ యనుపుణ్యనది; యిందు భరతుండు రాజ్యా
భిషిక్తుఁ డయ్యెఁ; దొల్లి యింద్రుండు లక్ష్మీప్రాప్తుం డై దీని జలోపస్పర్శనంబున
బాపవిముక్తుం డయ్యె; నిది మైనాకకుక్షి; యిం దదితి పుత్త్రార్థినియై తపంబు సేసె;
నిది ఋషిదైవతం బైనకనఖలనగం; బిది గంగానది; యిందు సనత్కుమారుండు
సిద్ధిం బొందె; నిది యుష్ణగంగ; యిందుఁ గృతస్నాను లైనం గృతార్థు లగుదు;
రిది రైభ్యాశ్రమం; బిది భరద్వాజాశ్రమం; బిందు భరద్వాజసుతుండు యవక్రీ
తుండు తపోవిద్యాగర్వంబున నపగతజీవుం డయ్యె” ననిన “నది యె” ట్లని ధర్మ
తనయుం డడిగిన రోమశుం డి ట్లనియె.
| 251
|
రోమశుఁడు ధర్మరాజునకు యవక్రీతు చరిత్రంబు చెప్పుట
| క. |
“అలఘులు రైభ్యభరద్వా
జులు దమలో సుహృదులై విశుద్ధతపోని
[4]శ్చలితమతు లివ్వనంబున
నొలసి తపం బొప్పఁ జేయుచుండిరి నెమ్మిన్.
| 252
|
| వ. |
అందు రైభ్యుండు [5]కృతాధ్యయనశూరు లైనయర్వావసు పరావసు లనుతన
యిద్దఱుపుత్త్రులతో విద్వత్పూజితుం డై యున్న, వానిం జూచి సహింపనోపక
భరద్వాజసుతుఁడు యవక్రీతుండు తపోబలంబున నఖిలవేదశాస్త్రాగమంబులు
వడయుదు నని సమిద్ధంబైన యగ్నియందు [6]సంధార్యంబు సంధిచుచు నుగ్ర
| 253
|
- ↑ అలయక ... జీవించుటయు నర లగుటయును నిది వృ
- ↑ శృతాధ్య ... యాచారపరుం
- ↑ నొెడించి తద్విజు కోడి యున్న; ... యొదిఁగియున్న ... మరలఁ దనతండ్రిని ... డఖిలలోక
- ↑ శ్చలమతి నివ్వనమున దా, రొలసి
- ↑ శృతాధ్యయనశూరు
- ↑ సాన్నాయంబు