| |
చేయుచు ననవరతంబును శిష్యుల వేదంబులు చదివించుచున్నఁ బెద్దకాలంబునకు
సుజాత గర్భిణి యైనఁ దద్గర్భంబున నున్నయర్భకుం డొక్కనాఁడు తండ్రి కి ట్లనియె.
| 237
|
రోమశుఁడు ధర్మరాజునకు నష్టావక్రుచరితంబు చెప్పుట
| క. |
“ఎడఁబడక [1]యహోరాత్రులు
వడిఁగొని చదివింప నిట్లు వలయునె? శిష్యుల్
గడు నిద్రలేమి నెంతయు
జడమతులై చదువు దప్పఁ జదువుచు నుండన్.”
| 238
|
| వ. |
అని యుపాలంభించి పలికిన నలిగి యేకపాదుండు “నీ వధ్యయంబునకు వక్రంబు
గాఁ బలికితివి గావున నెనిమిది వంకలు గల శరీరంబుతో జన్మింపు” మని కొడు
కునకు శాపం బిచ్చిన.
| 239
|
| ఆ. |
అగ్నికల్పుఁ [2]డై మహాత్ముఁడు కడుపునఁ
బెరుఁగుచుండె; నంత సరసిజాక్షి
ప్రసవకాల మైనఁ బతి కొక్కనాఁ డిట్టు
లనియెఁ బ్రసవభారమునకు వెఱచి.
| 240
|
| క. |
ధరణిఁ గడుఁబేదవారును
బురిటికి ఘృతతైలధాన్య[3]ములఁ జెచ్చెర ముం
దర సంగ్రహింతు; రవి మన
కరయగ నతిదుర్లభంబు లర్థము లేమిన్.
| 241
|
| వ. |
ఏమి సేయుదు? నెవ్విధంబున నీప్రసవక్లేశంబువలనఁ బాయుదు?” ననిన నేకపాదుం
డు ధనార్థి యయి జనకరాజుపాలికిఁ జని, వానియజ్ఞంబునందు వరుణపుత్త్రుం డైన
వందితో వివాదంబు సేసి, యోటుపడి, జలమగ్నుం డై యున్న నిట సుజాత
ప్రసూతియై యష్టావక్రుం గనియెఁ; దత్కాలంబున నుద్దాలకుభార్య శ్వేతకేతుం
గనియె; నిట్లు మాతులభాగినేయు లిద్దరు సవయస్కులై పెరిఁగి పండ్రెండేం
డ్లొక్కట నుద్దాలకుతోఁ జదివి యధ్యయనశూరులై రందు.
| 242
|
| తే. |
తండ్రి యనుచు నుద్దాలకుఁ, దనకు గరము
ప్రీతితో శ్వేతకేతుని భ్రాత యనుచు
ననఘచరితుఁ డష్టావక్రుఁ డనుదినంబు
నొం డెఱుంగక సుఖలీల నుండు నంత.
| 243
|
| వ. |
ఒక్కనాఁ డుద్దాలకుకురు వెక్కి యున్నయష్టావక్రుం జూచి శ్వేతకేతుండు
సహింపక “నీ వేల మాయయ్యకురు వెక్కి యుండె? దీవు వోయి మీయయ్య
కురు వెక్కు” మని చేయి పట్టి యీడ్చిన నేడ్చుచుం దల్లికడకుం జని యష్టావక్రుం
డి ట్లనియె.
| 244
|
| క. |
“మాయయ్య యెవ్వ? రెక్కడఁ
బోయిరి? సెప్పు” మని తెల్లముగ నడిగి తన
శ్శ్రీయుతుఁడు దండ్రికడకుం
బోయెం దనమామ నెయ్యమునఁ దోడ్కొనుచున్.
| 245
|
| వ. |
ఇ ట్లష్టావక్రుండు దానును శ్వేతకేతుండును జనకరాజుయజ్ఞంబునకుం జని యందు దౌ
వారికనివారితులై “మూకాంధబధిరపంగుస్త్రీబ్రాహ్మణసుప్రవేశం బగు
చున్న యీరాజద్వారంబున మమ్ము, విద్వాంసుల, బ్రాహ్మణుల నేల వారించి”
తనిన దౌవారికుం డి ట్లనియె.
| 246
|
- ↑ యెల్లరాత్రులు
- ↑ డమ్మహాత్ముఁడు కడుపులోఁ, బెరుగుచుండుఁ డంత ... బ్రసవకాలమునకు (బ్రసవభావమునకు) బతి కొక్కవేళ యి, ట్లనియె
- ↑ ములుఁ దగినవి చె, చ్చెర సంగ్రహింతు