Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

యు జీవింప నేర; రొక్కకపోతంబు రక్షించి పెక్కు జీవంబులకు హింస జేయుట
ధర్మవిరోధంబు.

⁠ 229


క.⁠

ధర్మజ్ఞు లైనపురుషులు
ధర్మువునకు బాధ సేయు ధర్మువు [1]నైనన్
ధర్మముగా మదిఁ దలఁపరు
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్.

⁠ 230


వ.⁠

ఇక్కపోతంబు నాకు వేదవిహితం బైనయాహారంబు; “శ్యేనాః కపోతాన్
ఖాదయన్తి” యను వేదవచనంబు గలదు; గావున దీని నా కాహారంబుగా ని మ్మ
నిన దానికి శిబి యి ట్లనియె.

⁠ 231


తే.⁠

ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను
నాశ్రయించె; నాశ్రితు నెట్టియధముఁ డయిన
విడువఁ డనినను నే నెట్లు విడుతు దీని?
నాశ్రితత్యాగ మిది ధర్ము వగునె? చెపుమ.

⁠ 232


వ.⁠

నీవు పక్షి వయ్యును ధర్మ మెఱింగినట్లు పలికితి; శరణాగతపరిత్యాగంబు సేయుట
కంటె మిక్కిలి యధర్మం బొం డెద్ది? నీయాఁకలి దీనన కాని యొంట నుపశమిం
పదే? నీయత్నం బాహారార్థం బేని యిప్పు డివ్వనంబున మృగమహిషవరాహఖగ
మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద; నిక్కపోతంబువలని యాగ్రహం
బుడుగుము; దీని నే నెట్లును విడువ” ననిన శ్యేనం బి ట్లనియె.

⁠ 233


ఆ.⁠

“నాకు విహితభక్షణం బిది యిప్పక్షిఁ
బూని కావ నీకు బుద్ధియేని
యవనినాథ! దీనియంత నీమాంసంబు
తూఁచి నాకుఁ బెట్టు తొలఁగ కిపుడ.”

⁠ 234


చ.⁠

అనిన “ననుగ్రహించితి మహావిహగోత్తమ!” యంచు సంతసం
బున శిబి తత్క్షణంబ యసిపుత్రిక నాత్మశరీరకర్తనం
బనఘుఁడు సేసి చేసి తనయంగమునం గలమాంస మెల్లఁ బె
ట్టినను గపోతభాగము కడిందిగ [2]డిందుచు నుండె నత్తులన్.

⁠ 235


క.⁠

దానికి నచ్చెరువడి ధర
ణీనాథుఁడు తనువునందు నెత్తురు దొరుఁగం
దాన తుల యెక్కె [3]నంతన్
వానిగుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్.

⁠ 236


వ.⁠

శ్యేనకపోతరూపంబులు విడిచి, నిజరూపంబుల జూపి “నీ ధైర్యశౌర్యాదిగుణం
బు లనన్యసాధారణంబులు; గావున నీకీర్తి నిత్యంబై శబ్దబ్రహ్మంబు గలయంత
కాలంబును వర్తిల్లుచునుండెడు” మని శిబికి వరం బిచ్చి యింద్రాగ్నులు చని; రిది
యమ్మహాపురుషుపుణ్యస్థానంబు; మఱియు ననవరతఫలవృక్షంబులు గలయిది
యౌద్దాలకి యైన శ్వేతకేతుతపోవనం; బిందు సరస్వతి మనుష్యస్త్రీరూపధారిణి
యై శ్వేతకేతుని సేవించె; మాతులభాగినేయు లైనయష్టావక్రశ్వేతకేతు లింద
యుగ్రతపంబుఁ జేసి” రనిన నం దష్టావక్రుమహాత్మ్యంబు వినవలతు నని యడి
గిన యుధిష్ఠిరునకు రోమశుం డి ట్లనియెఁ “దొల్లి [4]యేకపాదుం డనుమునివరుండు
తనవిద్యావిభవంబున సుజాత యనుదాని వివాహం బై వనంబున ఘోరతపంబు

⁠
  1. ↑ నెల్లన్, ధర్మువుగ నెందుఁ దలఁపరు; ధర్మువుగ నెడ్డ దలఁపరు
  2. ↑ డిగ్గుచు
  3. ↑ నప్పుడు
  4. ↑ ˈకహోళుఁˈ డని సంస్కృతభారతము.