Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

ఇ ట్లుద్భవించి దశసహస్రయోజనాయామంబు లైనబాహుదండంబులయు, శత
యోజనాయామంబు లైనచతుర్దంష్ట్రలయు, దశయోజనాయామంబు లైనద
శనంబులయు, శశిరవిమండలసదృశంబు లైననయనంబులయుఁ, గాలాగ్నిసన్నిభం
బైనవక్త్రంబును, దిగ్భూనభోభాగసంకటం బైనశరీరంబునుందోడ భూమి నొక్క
హనువును, దివంబును నొక్కహనువుగా వదనగహ్వరంబు దెఱచి జగజ్జన[1]సంత్రా
సనవ్యగ్రసంచలం బైనదీర్ఘజిహ్వ నధరోష్ఠపుటంబు నాకుచు, నత్యుగ్రనాదం
బున దిక్కులు వ్రచ్చుచు, వచ్చుమహారాక్షసుం జూచి సురేంద్రుండు వెఱచి
భార్గవస్తంభితభుజుండు గావున వాని నెద్దియుం జేయనేరక చ్యవనునొద్దకు వచ్చి,
కృతాంజలియై ”మునీంద్రా! నీతపోవీర్యమహారంభంబు మిథ్య యగునే? యాశ్వి
నులు నేఁడు మొదలుగా సోమార్హు లగుదురు; నీవు నాకుఁ బ్రసన్నుండ వై
క్షమింపు” మనిన.

⁠ 195


క.⁠

మునినాథు నలుకతోడన
యనిమిషపతి వజ్రయుతమహాభుజసంస్తం
భన ముడిగె నంత భృగునం
దను వీడ్కొని యింద్రుఁ డరిగెఁ దనవురమునకున్.

⁠ 196


వ.⁠

అమ్మదరాక్షసుండు నాక్షణంబ చ్యవనునుపదేశంబున మద్యస్త్రీమృగయాక్షం
బుల నాశ్రయించె; నాశ్వినులు సోమపీథులై దివంబున కరిగి; రిట భార్గవుం
డైనచ్యవనుండు తనతపోమహత్త్వంబునందుఁ బ్రకాశింపఁజేయుటంజేసి నాటం
గోలె నది యార్చీకపర్వతంబు నాఁ బరగె” నని రోమశుండు సెప్పిన నందులఁ
బుణ్యసరోవరంబునం గృతస్నాను లై పాండవు లరిగి యంత శంతనుశునకనర
నారాయణవిధాతృతపోవనస్థానం బై దేవర్షినివాసం బైనసైంధవారణ్యంబు
నం జంద్రసరోవరంబునందు రోమశనియక్తులై చరువులు చేసి, యతిథులం బూ
జించి చని యమునానదిం గని; రంత వారలకు రోమశుం డి ట్లనియె.

⁠ 197

మాంధాతృచరిత్రము

క.⁠

“ఇది యమున యనుమహానది
త్రిదశనదీనిభము; దీనితీరమున జగ
ద్విదితుఁడు మాంధాతృఁడు సం
పదఁ గ్రతువులఁ జేసెఁ దొల్లి బహువత్సరముల్.”

⁠ 198


వ.⁠

అనిన “మాంధాతృజన్మంబును, వానిచరితంబును వినవలతుం జెప్పు” మని యడి
గిన ధర్మరాజునకు రోమశుం డి ట్లనియె.

⁠ 199


ఉ.⁠

“[2]వీకున నశ్వమేధములు వే యొనరించిన ధర్మశీలుఁ, డి
క్ష్వాకుకులోద్భవుండు బలవంతుఁ, డనంతయశుం, డవార్యవీ
ర్యాకరుఁ, డుత్తముండు, యువనాశ్వుఁ డపత్యము లేమిఁ జేసి దుః
ఖాకులుఁ డై ప్రధానవరులందు సమర్పితరాజ్యభారుఁ డై.

⁠ 200


వ.⁠

భృగునాశ్రమంబునకుం జని పుత్త్రకాముం డై పెద్దకాలం బమ్ముని నుపాసించిన
నయ్యువనాశ్వునకుం గరుణించి భృగుండు పుత్త్రకామేష్టిఁ జేసి యందు మంత్ర
పూతజలపూరితంబై పుత్త్రోదయకారణం [3]బైనకలశంబు వడసి దాని రక్షించి

⁠
  1. ↑ సంగ్రసనవ్యగ్ర
  2. ↑ వీకువ ... చరులందు
  3. ↑ బైనశబకంబు