Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరశురాముఁడు కార్తవీర్యునిఁ జంపుట

చ.⁠

బలిమి నశేషలోకపరిభావిమహాద్భుతశౌర్యసంపదం
బొలుచు సహస్రబాహుకరముల్ గులిశాతినిశాతబాణధా
రల నతివీరుఁ డై తునిమి, రాముఁ డరాతులకున్ భయంబుగాఁ
గలహములోన వాని నతిగర్వితుఁ జంపె బరాక్రమోన్నతిన్.

⁠ 150


వ.⁠

అంతం గార్తవీర్యుని పుత్త్రులు బద్ధవైరు లై రామరహితం బయిన జమదగ్న్యాశ్ర
మంబునకు వచ్చి యందు.

⁠ 151


మ.⁠

మునులం దిట్టుచుఁ, బుష్పవృక్ష[1]తతు లున్మూలించుచుం, గ్రూరు లై
యనవద్యున్ జమదగ్నిఁ బట్టి బలిమిన్ హారామ హారామ యం
చును నాక్రోశము సేయుచుండఁగ, మునుల్ శోకింప, ధర్మాత్ము న
మ్మునిముఖ్యున్ వధియించి రాగ్రహమునన్ మోహాంధులై హైహయుల్.

⁠ 152


చ.⁠

వఱలఁగ రాముఁ డంత ననవద్యుఁడు వచ్చి బహుప్రలాప యై
యఱచుచు నున్న తల్లిని గృతాంతవశస్థితుఁ డైన తండ్రి, [2]న
త్తఱిఁ గని తీవ్రశోకపరిఘాతహతుం డయి తత్ప్రకార మం
దెఱిఁగి ముహూర్తమేనియు సహింపఁగ నోపక కోపదీప్తు డై.

⁠ 153


చ.⁠

“అనఘు, [3]ననాతతాయిఁ, గరుణాత్ముఁ, బ్రశాంతుని, దాంతు నిమ్మహా
మునివరుఁ జూచి చూచి యధముల్ వధియించిరి; దీనఁ జేసి దు
ర్జను లగుచున్న క్షత్త్రియులఁ జంపుదు” నంచుఁ బ్రతిజ్ఞ సేసె భూ
వినుతుఁడు జామదగ్న్యుఁ డతివీరుఁడు లోకభయంకరాకృతిన్.

⁠ 154


వ.⁠

ఇట్లు కృతప్రతిజ్ఞుం డై క్షత్త్రియుల నెల్ల వధియించి దిగ్ధంతిదంతార్గళాఘాటమ
హీచక్రంబు సాధించి, విహితవివిధాధ్వరుం డై కశ్యపునకు నార్త్విజ్యదక్షిణగా
నఖిలభూవలయంబు నిచ్చి, నిస్సంగుం డై మహేంద్రపర్వతంబునం దపోనిత్యుం
డై యున్నవాఁ” డని పరశురాము చరితంబు సెప్పిన విని ధర్మజుండును బ్రాహ్మణ
సహితుం డై మునిగణోపదేశంబునం జతుర్దశినాఁడు పరశురాము జూచి పరమ
భక్తిం బూజించి, తత్ప్రతిపూజితుం డై దక్షిణదిక్కునకుం జని.

⁠ 155


క.⁠

[4]భూవినుతం బై త్రిభువన
పావనమై త్య్రంబకప్రభవ మైన జలౌ
ఘావళిఁ బవిత్ర మగు గో
దావరిఁ బుణ్యనదిం గనియె దక్షిణగంగన్.

⁠ 156


శా.⁠

గోదేవక్షితిదేవభక్తిపరుఁ డై, గోదావరీస్నాతుఁ డై
గోదానంబులు, [5]హేమదానములుఁ, బెక్కుల్ రత్నదానంబులన్
భూదేవోత్తమపూజ సేయుచు జగత్పూజ్యుండు ధర్మాత్మజుం

⁠
  1. ↑ తతి నిర్మూలించుచున్ ... రాగ్రహమహామో
  2. ↑ నొ, క్కెఱఁ (ను, క్కెఱఁ) గని తీవ్రశోకపరిఖేదహతుం ... సహింపక నంతక
  3. ↑ నివీతరాగుఁ
  4. ↑ భూవిదితం బై ... జలౌ, ఘావలిఁ బ్రశస్త మగు
  5. ↑ భూమిదానములు