Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

డై రోమశుండు “వైఖానసనివాసం బిందులకు ముప్పదివేల యోజనంబులు
గలదు; వారల యధ్యయనశబ్దంబులు వింటివి గావున నీవు దివ్యుండ” వంచు నరిగి
యనవరతఫలాలంకృతం బైన యొక్కవనంబు గని యి ట్లనియె నిందుఁ దొల్లి
స్వాయంభువుం డైన విశ్వకర్మ యజ్ఞంబు సేసి.

⁠ 120


క.⁠

దక్షుఁ డయి యజ్ఞదక్షిణ
దక్షిణభూభాగమెల్లఁ దా నిచ్చె నశే
షక్షితిధరవనములతో
నక్షయ[1]గతిఁ గశ్యపునకు నార్త్విజ్యమునన్.

⁠ 121


వ.⁠

దాని కలిగి భూదేవి కశ్యపునకుం బట్టీక, రసాతలంబునకుం [2]బోయినఁ దత్ప్రసా
దార్థి యై కశ్యపుఁ డుగ్రతపంబు సేసినం బ్రసన్నయై భూదేవి నీరిలోనుండి
వెలువడి, వేదిరూపంబునం గశ్యపునకుఁ బొడసూపె; “నవ్వేది యిది సుమ్ము; దీని నె
క్కినవారు వీర్యవంతు లగుదు రీమంత్రంబున దీని నెక్కుండు; పెఱనాఁ డిది దా
వీక సముద్రంబు సొచ్చు” నని “యగ్నిర్మిత్రోయోని” యను నివి యాదిగాఁ గల
మంత్రంబు లుపదేశించిన.

⁠ 122


క.⁠

అనుజులుఁ దానును మునిశా
సనమున నవ్వేది యెక్కి సమధికవీర్యం
బున నొప్పె బ్రాహ్మణులదీ
వన లెసఁగఁగ ధర్మసుతుఁడు వాసవలీలన్.

⁠ 123


క.⁠

ధరణీసురవరమునిగణ
పరివృతు లై యరిగి కనిరి పాండవులు వియ
చ్చర[3]సేవితబంధురసుం
దరకందర మగు మహేంద్రధరణీధరమున్.

⁠ 124


వ.⁠

అందుల మహాతపోధనులకు నమస్కారసత్కారంబుల మనఃప్రియంబు సేసి ధర్మ
రా జి ట్లనియె.

⁠ 125


తే.⁠

“పరమమునులార! యిగ్గిరిఁ బరశురాముఁ
శుభచరిత్రుని మీ రెప్డు సూతు రట్టె!
యమ్మహాభాగు మీచూచునవసరంబు
నందు మాకును జూడంగ నమరునొక్కొ?”

⁠ 126


వ.⁠

అనిన నమ్మునిసంఘంబులోన రామానుచరుం డయిన యకృతవ్రణుం డనుముని
ధర్మరాజున కి ట్లనియె.

⁠ 127


తే.⁠

“ధర్మతనయ! మీరాక ముందఱ యెఱుంగు
జామదగ్న్యుండు నిర్మలజ్ఞానదృష్టి;
ననఘ! యెల్లి చతుర్దశి నమ్మహాత్ముఁ
జూతు రిమ్మును; [4]లీవును జూడు మిచట.”

⁠ 128


వ.⁠

అనిన ధర్మతనయుండు మహేంద్రంబున నారాత్రి వసియించి యకృతవ్రణు
నిట్లని యడిగె.

⁠ 129


క.⁠

“భువన[5]స్తుత్యుం డగు భా
ర్గవుచరితము వినఁగ నాకుఁ గడుఁ గౌతుక గౌ
రవ మైనది; దాని ముని
ప్రవర! యెఱింగింపు కర్ణపథరమ్యముగాన్.”

⁠ 130

అకృతవ్రణుఁడు ధర్మరాజునకుఁ బరశురామునిమహిమ సెప్పుట

వ.⁠

అని యడిగిన ధర్మరాజునకు నకృతవ్రణు డిట్లని చెప్పెఁ “దొల్లి కన్యాకుబ్జంబున

⁠
  1. ↑ మతిఁ
  2. ↑ సొచ్చిపోయినఁ ... లేనినాఁ డిది త్రోవ యీక సముద్రంబు సొచ్చునని ˈమిత్రావరుణేతిˈ యను నివి
  3. ↑ నిర్జరసేవితసుం
  4. ↑ లిందఱుఁ జూడు (మీవు) నిందు
  5. ↑ జనస్తుతుఁ డగు ... గౌతుకమై, తివిరినది మది మునీంద్ర, ప్రవర