Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

దంద చఱచుచు నది నేలం బడి యెగయం బోయిన వలనికి వ్రాలుచు, వాతా
వధూతం బైనబాలవృక్షంబునుం బోలె నొప్పుచున్న, నమ్మునిపుత్త్రునందు
నాహృదయంబు దద్దయుం దగిలినయది.

⁠ 106


ఉ.⁠

నన్నునుఁ గౌఁగిలించుకొని, నావదనంబునకున్ నిజాస్య మా
సన్నముఁ జేసి, యొక్క మృదుశబ్దము [1]సేసె మనోహరంబుగా;
నెన్నఁడు నట్టిశబ్దము మునీశ్వర! మున్ విని యే నెఱుంగ; న
య్యిన్నువ బ్రహ్మచారిముఖ మంబురుహంబుసమంబు సూడఁగన్.

⁠ 107


వ.⁠

నాయిచ్చినవన్యస్వాదుఫలంబు [2]లాదరించి యారగింప కమ్మునికుమారుం డమృ
తోపమానంబు లైనఫలంబులు, నతిమధురంబు లైనపానీయంబులు నాకు నిచ్చిన
నుపయోగించితి; నట్టిరసవిశేషంబు లేను మున్నెన్నడు రుచియించుట లేదు;
మఱియును.

⁠ 108


క.⁠

తనచేతి[3]పుష్పములఁ జ
ల్లిన నంతటఁ జెదరి యవి యళిప్రకరనిషే
పన మొప్ప నున్నయవి; యి
వ్వనకుసుమము లట్లు గావు వరగంధంబుల్.

⁠ 109


వ.⁠

నాకు నమ్మునిపుత్త్రు నాశ్రమంబునందు వానితో నొక్కటఁ దపంబు సేయుచుండ
నిష్టం” బనినఁ గొడుకు పలుకులు విని విభాండకుండు విస్మితుం డై “తపస్వులతపంబు
లకు విఘ్నంబులు సేయ ననేకరూపులయి రాక్షసులు వనంబునం గ్రుమ్మరుచుండు
దురు; [4]తజ్జనదత్తంబు లయిన పానీయంబు లపేయంబు; లతిసుగంధులయిన కుసు
మంబులు మునులకు వర్జనీయంబు” లని కొడుకుం బ్రబోధించి యెప్పటియట్ల
వన్యఫలంబులు దేర నరిగిన.

⁠ 110


క.⁠

చనుదెంచి తరుణి మునినం
దనుచిత్తంబునకు వైకృతము జేసె; విలా
సినుల సహాలాప సహా
సన సహయానములు [5]బంధసమములు గావే?

⁠ 111


వ.⁠

ఇట్లు ఋశ్యశృంగుండు విలాసినీమోహితుం డయి తండ్రి కెఱింగింపక, [6]స్వచరితం
బయిన తనయాశ్రమంబు విడిచి మనుష్యయోగంబునం దగిలి యక్కోమలిపిఱుం
దన చని, యంగదేశంబు సొచ్చి, యందు రోమపాదునాదేశంబున రాజాశ్రయం
బనుభవనంబున నుండునంత.

⁠ 112


మత్తకోకిలము.⁠

[7]అమ్మునీశు నివాసశక్తిఁ దదంగదేశమునందు మే
ఘమ్ము లెల్లవలంకులం గడుఁ గ్రమ్మి సర్వజనప్రమో
దమ్ముగాఁ బ్రభవద్బృహజ్జలధార లొప్పఁగ వృష్టిఁ జే

⁠
  1. ↑ సెప్పె
  2. ↑ లాదరింపక; లుపయోగింపక; లారగింపక
  3. ↑ పుష్పములుఁ జల్లిన; పుష్పములు సల్లిన ... యని యలిప్రకరము మూఁ, గిన నొప్పుచున్న మఱి యి, వ్వన ... వరగంధములన్
  4. ↑ సజ్జనదుస్తరంబులై యసజ్జనదత్తంబులై రసవంతంబు లైనపానంబు లపేయంబు
  5. ↑ సింధుసమములు గావే
  6. ↑ సుచారిత్రం బైన ... పుష్యయోగంబు; పుణ్యయోగంబు
  7. ↑ అమ్మునీంద్రు ... (లెల్ల గెలంకులన్) లెల్ల గణంగి గ్రక్కునఁ గ్రమ్మినన్ గడుసర్వమో ... బ్రపతద్బృహజ్జల