Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఋశ్యశృంగుఁడు వేశ్యను మునికుమారునిఁగా భావించుట

మధ్యాక్కర.⁠

 “ఎందుండి వచ్చితి ఋషికుమారక? యే నెన్నఁడు నిట్టి
సుందరాకారు మునిసుతు నేఁ దొల్లి చూచి యెఱుంగ;
నిందుండు మీ” వని కృష్ణమృగచర్మకృతకుశాసనము
నం దుండఁ గాఁ బనిచె ఋషి యనుబుద్ధి నత్తన్విఁ బ్రీతి.

⁠ 97


వ.⁠

మఱియు నర్ఘ్యపాద్యాదివిధులను, వన్యస్వాదుఫలదానంబులఁ దాని కతిథి
పూజ సేయ నున్న నది యమ్మునివరున కి ట్లనియె.

⁠ 98


క.⁠

“మాయాశ్రమ మిందులకున్
న్యాయనిధీ! మూఁడుయోజనంబులు గల; దే
బోయెద; నీవును విజయం
చేయుము యందులకుఁ; జెలిమి సేయుము నాతోన్.

⁠ 99


వ.⁠

అట్లేని నీచేత సత్కారంబు గొందు” ననిన ఋశ్యశృంగుం “డట్లు సేయుదు” నని
దాని నాతిథ్యవిధానంబునం బూజించి తనకు దానియిచ్చినదివ్యగంధమాల్యంబు
లును సరసభక్ష్యపానంబులును విచిత్రవస్త్రంబులు బరిగ్రహించిన నదియును.

⁠ 100


క.⁠

మునిముందటఁ గందుకన
ర్తనమృదుగీతములయందుఁ దనకౌశల మె
ల్లను జూపి, విరచితాలిం
గన యై మునిపతికి ముదము గావించె మదిన్.

⁠ 101


వ.⁠

ఇట్లు ఋశ్యశృంగుం బ్రబోధించి వేశ్యాపుత్త్రి యరిగిన దానిపోయినవలను
సూచుచు ఋశ్యశృంగుం డగ్నిహోత్రంబు వేల్వ మఱచి విపరీతబుద్ధియై
యున్న నంత నడవినుండి వన్యఫలంబులు గొనివచ్చి విభాండకుండు
గొడుకుం జూచి “యిట్లేల చింతాపరుండ వై యగ్నిహోత్రంబు వేల్వక, కా
లాతిక్రమంబు సేసి” తనినఁ దండ్రికి ఋశ్యశృంగుం డి ట్లనియె.

⁠ 102


సీ.⁠

“కాంచనపర్ణుండు, గడురూపవంతుండు,
                 [1]గమ్మనిజడలతో ఘనము లగుచు
ననయంబు వట్రులగు రెండు పిండంబు
                 లురమున విలసిల్లుచుండ, నఱుత
వెలుఁగుచు జపమాల వ్రేలంగ, నన్నువ
                 నడుమును వడఁకంగ, నడచునపుడు
కలహంసకూజితకలనాద మెసఁగ
                 నాపాలికి నేఁ డొక్కబ్రహ్మచారి

⁠


ఆ.⁠

వచ్చి పోయె; వానివదనంబువలన వె
ల్వడు సుగంధిమధురభాషితంబు
పొలుచు వినఁగ సమదపుంస్కోకిలాలాప
చారు వగుచు హృదయసమ్మదముగ.

⁠ 103


క.⁠

ఆఋషికుమారు కట్టిన
చీరలు నతిమృదులములు, విచిత్రములు, మనో
హారము వానిబృహత్కటి
భారమునం దొక్కకనకపట్టము [2]వెలుఁగున్.

⁠ 104


క.⁠

పవన[3]సమీరతమధుసం
భవవివిధప్రసవసౌరభముఁ బోలి ముని
ప్రవరుని తనువునయం దు
ద్భవమై రమ్య మయి సౌరభము విలసిల్లున్.

⁠ 105


వ.⁠

మఱియు నక్కుమారుం డొక్కయెఱ్ఱనిఫలంబు దనదక్షిణపాణితలంబున నం

⁠
  1. ↑ కమ్మనియొడలితో ... నిం దొక్కబ్రహ్మ ... సుగంధమధురభాషణంబు; సంబంధమధురభాషణముల, పొలుపు వినఁగ
  2. ↑ వ్రేలున్
  3. ↑ సమీహిత ... వొలుచు ముని ... దేహంబున ను(మృదుతనువునఁ ద), ద్భవ మై యతిహృద్యసౌరభము