| |
మకరకులక్షుభ్యమాణ మై తద్బాధ
[1]కోపనియదివోలె నుచ్చభీమ
|
|
| ఆ. |
నినద మగుచు నున్న నీరధియొద్దకు
నమరగణముతో మహామునీంద్ర
గరుడ ఖచర సిద్ధ గంధర్వ పన్నగ
యక్షగణముతోడ నరుగుదెంచి.
| 38
|
| ఉ. |
అందఱుఁ జూచుచుండఁగ మహాబ్ధిజలంబులఁ ద్రావె విష్ట పా
నందకరుం డగస్త్యుఁ డఘనాశనుఁ; డట్లు పయోధి రిక్తమై
నం దిమి కూర్మ కర్కటక నక్ర భుజంగచయంబుతో భయం
బందుచుఁ గాలకేయులు బయల్పడి తోఁచిరి [2]దానిలోపలన్.
| 39
|
| క. |
గీర్వాణప్రభుఁ డాదిగ
గీర్వాణగణంబు గాలకేయులతోడన్
గర్వించి రణము సేసి ర
ఖర్వపరాక్రములు గడిమిఁ గడు నుద్ధతులై.
| 41
|
| క. |
అనిమిషదివ్యాయుధహతి
నని గొందఱు వడిరి; గొంద ఱధికవిభీతిం
జని పాతాళముఁ జొచ్చిరి
దనుజులు దైత్యులును వీర్యదర్పచ్యుతులై.
| 42
|
| వ. |
ఇట్లు కాలకేయులం దొట్టి యసురుల నెల్ల [3]నిశ్శేషంబుఁ జేసి జగంబుల యుప
ద్రవం బుడిపి దేవత లగస్త్యునిం గీర్తించి యి ట్లనిరి.
| 43
|
| క. |
“మునినాథ! నీ యనుగ్రహ
మున [4]నుడిగెను బాధ నిఖిలభువనంబుల కి
వ్వనధిఁ బయఃపూర్ణముఁగా
నొనరింపుము; నీవకాని యొరు లోప రిలన్.
| 44
|
| వ. |
ఇది యనేకసత్త్వాశ్రయంబు గావున రిక్తంబై [5]యుండఁ దగ” దనిన నగస్త్యుం
డి ట్లనియె.
| 45
|
| సీ. |
“[6]మున్న జీర్ణం బయ్యె మున్నీటినీరు నా
కడుపున; నే నింకఁ బడయనేర;
జలరాశి నిండంగ జలమొండు” నావుడు
నమరులు మునులును గమలగర్భుఁ
గానంగఁ జని “దేవ! మీనాకరం బేమి
తెఱఁగున నిండు? మా కెఱుఁగఁ జెపుమ”
యని విన్నపంబు సేసినఁ బెద్దప్రొద్దు చిం
తించి, వారలకు విరించి యనియె
|
|
| ఆ. |
“వనధిఁ బెద్దకాలమున భగీరథుఁడను
వాఁడు నించుఁ; గాని వసుధ నొరులు
పూని దీని నింపఁగా నోప” రనవుడు
నమరవరులు మునులు నరిగి రనిన.
| 46
|
| క. |
వనరాశి యేమి కారణ
మున నెట్లు భగీరథుండు భూరిజలౌఘం
బున నించె? దీనిఁ [7]జెప్పుమ”
యని యడిగిన ధర్మజునకు నమ్ముని సెప్పెన్.
| 47
|
భగీరథుండు జలముచే సముద్రము నించుట
| వ. |
“తొల్లి యిక్ష్వాకువంశంబున సగరుండను రాజు హైహయుల నిర్జించి, నిఖిలమహీ
రాజ్యంబు సేయుచు నపుత్త్రకుం డై వైదర్భియు, శైబ్యయు నను నిద్దఱు భార్యల
తోడం గైలాసంబున కరిగి యందు.
| 48
|
- ↑ కోడనియదివోలె నుబ్బి ... యక్షవరులతోడ
- ↑ వార్ధిలో
- ↑ నిశ్చేష్టితుల (సేసి)౦జేసి
- ↑ నిగ్రహ ముడిగె నఖిల ... నొనరింపఁగ
- ↑ యుండఁ గా దనిన
- ↑ మున్ను జీర్ణం ... కడుపునం దే ... వినుఁడు పెద్దకాల ... వాఁడు గాని యింక వసుధ నొరులు ... నరిగి రెలమి
- ↑ జెప్పుం డని