| ఆ. |
త్వష్ట యంత నూఱుధారల రమ్యమై
యనలకణకరాళ మైనవజ్ర
మొనరఁ జేసి “దీన నోర్వుము దైత్యుల”
ననుచు నిచ్చె దాని నమరపతికి.
| 7
|
| వ. |
అవ్వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించె నంత.
| 8
|
| చ. |
అనుపమదివ్యశస్త్రధరు లైన యమర్త్యుల కాహనంబులో
మొనయక కాలకేయులు సముద్రము జొచ్చి దివంబు లెల్ల న
వ్వనధి నడంగి యుండి, బలవంతులు వెల్వడి రాత్రు లెల్ల భూ
జనులకు బాధ సేయుచు భృశంబుగ నుండిరి క్రూరచిత్తులై.
| 9
|
| వ. |
మరియు విద్యాతపోయుక్తు లై, ధర్మచరుతు లైన వారికారణంబున జగంబు
లపాయంబు నొందక సుఖం బున్నయవి; గావున నట్టి వారిన రోసి వధియించి
జగంబుల కపాయంబు సేయుద మని యసురులు వసిష్ఠాశ్రమంబున నూటతొం
బదియేడ్వురను, జ్యవనాశ్రమంబున నూర్వురను, భరద్వాజాశ్రమంబున నిరువ
దుండ్రను గాఁ బలువురు భ్రాహ్మణుల బ్రహ్మమయుల వధియించి భక్షించి
యిప్పాట ననవతరంబు నఖిలమునిగణాశ్రమంబుల కుపద్రవంబు సేయుచున్న.
| 10
|
దేవతలు వైకుంఠమునకుఁ బోయి విష్ణుని స్తుతియించుట
| క. |
యాగాదిపుణ్యకర్మ
త్యాగము మర్త్యమున నైనఁ, దా రధికభయో
ద్వేగంబునఁ బురుహూతపు
రోగములై యగ్ని యమ వరుణ ధనదాదుల్.
| 11
|
| క. |
చని వైకుంఠంబునఁ ద్రిభు
వనపతి, వైకుంఠు, గరుడవాహను, విష్ణున్
దనుజవిభంజను గని యి
ట్లని రెంతయు భక్తితోఁ గృతాంజలు లగుచున్.
| 12
|
| వ. |
దేవా! నీవు వరాహరూపధరుండవై మహీతలం బెత్తి, నరసింహరూపంబు దాల్చి
యాదిదైత్యు హిరణ్యకశిపు వధించి, వామనుండవై బలిం గట్టి, యజ్ఞమూర్తివై
యజ్ఞవిఘ్నకరుం డైన జంభుం డను దానవుం జంపి, యండజజరాయుజస్వేదజోద్భి
జ్జంబు లనం బరగిన చతుర్విధప్రజల రక్షించుచున్న జగద్రక్షకుండవు; గావున
నీకు విన్నపంబు సేసెద; మిప్పుడు జగంబుల కైన యుపద్రవంబు చిత్తగింపుము.
| 13
|
| సీ. |
కాలకేయులు మహాకాయులు పగ లెల్ల
జలదుర్గబలమున జలధి నుండి
రే లెల్లఁ జని నలిరేఁ గి మునీశ్వరా
శ్రమముల సద్ధర్మచారు లైన
బ్రాహ్మణ ప్రవరులఁ బాయక వధియింతు;
రెట్టి పాపాత్ములు నెయ్యుగముం
బ్రాహ్మణహింస యాపాదింతురే? యది
వీరలవలనన వినఁగఁ బడియెఁ;
|
|
| ఆ. |
బరమసాధు లైన బ్రాహ్మణులకు బాధ
యగుడు మహికి బాధ యగు; ధరిత్రి
కైన బాధఁ జేసి యఖిలలోకంబులుఁ
గరము బాధ నొందుఁ గమలనాభ!
| 14
|
| వ. |
ఎ ట్లనిన వేదంబులు ధరియించి విప్రులు వేదచోదితంబు లైన పుణ్యకర్మంబులు
విధియించుటం జేసి హవ్యకవ్యంబుల దేవతలుం బితరులుఁ దృప్తులైన, వారివ
లన నెల్ల లోకంబులకు సుఖం బగుం గావున బ్రాహ్మణోపద్రవంబు పరిహరించి
|
|