Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

జేసి యిధ్మవాహుం డనం బరగె; ని ట్లగస్త్యుండు పుత్త్రపౌత్త్రవంతుం డయి
తనపితరులం బుణ్యలోకగతులం జేసె; నని వైశంపాయనకథితకథాక్రమం బతి
రమ్యంబు గాను.

⁠ 356


క.⁠

[1]కలికాలభరత! లక్ష్మీ
లలనాస్పదవీరగుణవిలాస! విరోధి
ప్రళయాంతక! నిఖిలమహీ
వలయోద్వహబాహు! విష్ణువర్థనమూర్తీ!

⁠ 357


పృథ్వి.⁠

సమస్తభువనాశ్రయా! వినయసత్యనిత్యోదయా!
సమీహిత[2]గుణక్రియా! స్థిరవిశాలకీర్తిప్రియా!
నమన్నృపకిరీటచుంబిచరణద్వయా! సంతత
క్షమాభరణ! రాజరాజ! పరగండభేరుండకా!

⁠ 358


గద్యము.⁠

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైనశ్రీమహాభారతంబునం
దారణ్యపర్వంబున బృహదశ్వుదర్శనంబును, నలోపాఖ్యానంబును, నారదాగమ
నంబును, సకలతీర్థకీర్తనంబును, రోమశుం డర్జునుకుశలవార్తఁ జెప్పుటయు, రోమశ
మహామునియుపదేశంబున ధర్మజుతీర్థాభిగమనంబును, నగస్త్యుండు లోపాము
ద్ర బరిగ్రహించుటయు, వాతాపిభక్షణంబును నన్నది ద్వితీయాశ్వాసము.

⁠
  1. ↑ కలికాలచరిత ... విష్ణువర్ధనదేవా; ... వలయాస్పదబాహు విష్ణువర్ధననృపతీ
  2. ↑ హితక్రియా శుభవిశాల