రసానాం విరోధో యథా
| ఉభౌ శృంగారబీభత్సౌ మిథో వీరభయానకౌ. | 396 |
| రౌద్రాద్భుతౌ తథా హాస్యకరుణౌ ప్రకృతిద్విషౌ, | |
శృంగారరసమును భీభత్సరసమును పరస్పరవిరోధులు. వీరరసమును భయానకరసమును విరోధులు. రౌద్రరసమును అద్భుతరసమును విరోధులు. హాస్యరసమును కరుణరసమును విరోధులు.
| రసాః కార్యవశాత్సర్వే మిళంత్యేవ పరస్పరం. | 397 |
| ప్రథమం యో రసః ఖ్యాతః స ప్రధానో భవిష్యతి, | |
అన్నిరసములును కార్యవశమువలనఁ జేరుచున్నవి. వానిలో మొదట ఏరసము చెప్పఁబడుచున్నదో అది ప్రధానరస మనఁబడును.
| ముఖ్యే రసే౽పి తే౽౦గత్వం ప్రాప్నువంతి కదాచన. | 398 |
రసములలో ముఖ్యమైనరసమందు తదితరరసములు ఒకానొకసమయమందు అంగత్వమును బొందుచున్నవి.
| సుచారిణాం రసానామప్యానుకూల్యమిహోచ్యతే, | |
8 రసములకును 33 వ్యభిచారిభావములకును పరస్పరానుకూల్యము చెప్పఁబడుచున్నది.
1 శృంగారవ్యభిచారిణామానుకూల్యం
| సర్వే భావాః ప్రయోక్తవ్యాశృంగారే వ్యభిచారిణః. | 389 |
శృంగారరసమందు 33 వ్యభిచారిభావములును ప్రయోగింపఁదగును.
2 వీరవ్యభిచారిణామానుకూల్యం
| అమర్షశ్చ నిబోధశ్చ వితర్కో౽థ మతిర్ధృతిః, | 400 |
| గర్వో మదస్తథోగ్రత్వం భావా వీరే భవంత్యమీ, | |