పుట:భరతరసప్రకరణము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గలచూపు ఈఉద్దీపనములు, నేలబడుట, ముఖవైవర్ణ్యము, చేతులు వ్రేలవేయుట, అవికత్థనము, చేతులను తలపై పెట్టుకొనుట, నిట్టూర్పు లిడుట, ఱొమ్ము తల ముఖము వీనిని కొట్టుకొనుట, నేలమీఁద పొర్లుట, హాహాకారము, రోదనము విలాపము పరిదేవనము ఈఅనుభావములును, స్తంభప్రళయాది సాత్వికభావములును, నిర్వేదము దైన్యము ఆలస్యము ఉన్మాదము వ్యాధి సుప్తి నిద్ర మోహము శ్రమము గ్లాని చింత స్మృతి అపస్మారము విషాదము జాడ్యము ఔత్సుక్యము శంక మరణము ఈవ్యభిచారిభావములును గలవు. ఈభావములు ఉత్తమమధ్యమాధమవిషయములయందు యథోచితముగ గలుగును.

అద్భుతరసలక్షణం

విభావైరనుభావైశ్చ సాత్వికై ర్వ్యభిచారిభిః.

354


ప్రాప్తస్సదస్యాస్వాద్యత్వం విస్మయో౽ద్భుతతాం వ్రజేత్,
దుష్ప్రప్యవస్తునః ప్రాప్తిః కర్మ చాప్యతిమానుషం.

355


మరీచిమానగంధర్వనగరాద్యవలోకనం,
మాయేంద్రజాలనృత్తాది యస్య చాలంబనం నుతం.

356


ప్రసన్నముఖరాగో౽క్షి విస్తారో నిర్నిమేషతా,
శిరఃకపోలచలనం సాత్వికాశ్చానుభావకాః.

357


వితర్కచాపలావేగ హర్షాద్యా వ్యభిచారిణః,

విభావానుభావసాత్వికభావవ్యభిచారిభావములచే సభవారికి ఆస్వాద్యత్వమును బొందియుండు విస్మయస్థాయి అద్భుతరస మౌను. ఈ అద్భుతరసమునకు దుష్ప్రాప్యమైనవస్తువులప్రాప్తి, మనుష్యులకు అశక్యమైన పనులను జేయుట, కాంతిచే నిర్ణయింపఁదగిన గంధర్వనగరాదులఁ జూచుట, మాయ ఇంద్రజాలవిద్య నృత్యము మొదలయినవి ఆలంబనములు. అందు ప్రసన్నమైనముఖరాగము, నేత్రవిస్తారము, ఱెప్పపాటు లేకయుండుట, తల కపోలప్రదేశము వీనిని కదలించుట ఈఅనుభావములును, స్తంభాదిసాత్వికానుభావ