| ధర్మనాశో౽ర్థనాశశ్చ బాంధవేష్టజనక్షయః, | 346 |
| దైవోపహతిధిక్కారౌ వ్యాధిశ్శాపోవశంసనం, | 347 |
| యస్య చోద్దీపనం జ్ఞేయం ఆలంబనగుణాశ్రయం, | 348 |
| రక్తాభో ముఖ రాగశ్చ సబాష్పా మంధరా చ దృక్, | 349 |
| విన్యాసో హస్తయోర్మూర్ధ్ని నిశ్వాసోఛ్వాసదీర్ఘతా, | 350 |
| హాహాకారస్తథాక్రందో విలాపః పరిదేవనం, | 351 |
| నిర్వేదో దైన్యమాలస్యం ఉన్మాదవ్యాధిసుఫ్తయః, | 352 |
| విషాదో జాడ్యమౌత్సుక్యం శంకా మరణమేవ చ, | 353 |
| ఉత్తమాధమమధ్యేషు యథాయోగం భవంత్యమీ, | |
విభావానుభావసాత్వికవ్యభిచారిభావములచే సదస్యులకు అనుభవార్హత్వమును పొందింపఁబడినశోకస్థాయి కరుణరస మనఁబడును. ఇందు ధర్మనాశము, అర్థనాశము, ఇష్టజనబాంధవజనక్షయము, వధము, తూకువేయుట (ఉరిదీయుట), దారిద్ర్యము, పద్మభ్రంశము, అవమానము, దైవోపహతి, ధిక్కారము, వ్యాధియు, శాపమును చెప్పుట ఇవి మొదలయినవి చూడఁబడినను అనుభవింపఁబడినను వినఁబడినను ఆలంబనవిభావము లగును. ఉద్దీపనవిజ్ఞానములును వాని నాశ్రయించియుండును. వెండ్రుకలు వస్త్రము దేహము ఇవి వికారమును బొందుట, దేహము సోలియుండుట, ఎఱ్ఱని ముఖకాంతి, కన్నీరు