| వైముఖ్యమశ్రుచామర్ష ఇత్యాద్యైరనుభావ్యతే, | 326 |
అన్య స్త్రీ సంభోగము నెఱుఁగుటచే ప్రియునియందుఁ గలుగుతాపము ఈర్ష్యామాన మనఁబడును. ఇది అభాషణము, ఉపాలంభము, బెదిరించుట, కొట్టుట, వైముఖ్యము, కన్నీరు, ఓర్వమి, ఇవి మొదలైనవానిచే నెఱుఁగఁదగినది. దీని నెఱుఁగుట వినికి, చూచుట, అనుమానము (ఊహించుట) ఈమూఁటిలో దేనివలననైన నగును.
శ్రవణాదీని నిరూపయతి
,
| శ్రవణం దూతికాదిభ్యో దృష్టిస్సాక్షాద్విలోకనమ్, | 327 |
శ్రవణ మనునది దూతిక మొదలయినవారివలన వినుట, దృష్టి యనునది ఎదురుగఁ జూచుట, అనుమాన మనునది స్వప్నమందు పేరు మార్చి పిలుచుట మొదలయినవానిచేతఁ గలుగునని చెప్పఁబడుచున్నది.
ప్రవాసవిప్రలంభలక్షణం
| దేశాంతరస్థితిర్యాతు ప్రవాసస్సో౽భిధీయతే, | 328 |
| లంబాలకత్వమిత్యాద్యా అనుభావాస్సమీరితాః, | |
నాయికానాయకుల దేశాంతరస్థితి ప్రవాసవిప్రలంభ మనఁబడును. ఇందు చిక్కిపోవుట, తెల్లనౌట, నిట్టూర్పు, చింత, దైన్యము, కన్నీరు, లంబాలకత్వము మొదలయిన యనుభావములు గలుగును.
శాపవిప్రలంభలక్షణం
| శాపస్తు జాడ్యజాచ్ఛాపాత్ సుదూరే వాథ సన్నిధౌ. | 329 |
| చింతాసంతాపనిశ్వాస పాండిమాద్యనుభావభాక్, | |