తం విభజతే
| విప్రలంభశ్చ సంభోగ ఇతి స ద్వివిధా భవేత్, | |
ఆశృంగారరసము విప్రలంభశృంగారమని, సంభోగశృంగారమని రెండువిధము లౌను.
విప్రలంభం లక్షయతి
| అప్రాప్తిర్విప్రలంభస్స్యాద్యూనోర్జాతాభిలాషయోః. | 290 |
| పాండిమగ్లానిదృష్ట్యాద్యా అనుభావా ఇహ స్మృతాః, | 291 |
| అన్యే సంచారిణస్సర్వే భవంత్యత్ర యథోచితం, | |
అత్యంతాసక్తిగల నాయికానాయకులకు పరస్పరము చేరికలేకయుండుట విప్రలంభ మనఃబడును. ఇందు విరహపాండిమము, సోలినచూపు మొదలయినవిగలుగును. హర్షము, గర్వము, జుగుప్స, ఉగ్రభావము, మదము, హాసము, శమము ఇవివినా కడమసంచారిభావములన్నియును ప్రకృతానుగుణముగ గలుగును.
విప్రలంభం విభజతే
| అయోగో విరహో మానః ప్రవాసశ్శాప ఇత్యపి. | 292 |
| విప్రలంభస్య పంచైతే హేతవః పరికీర్తితాః, | |
అయోగము, విరహము, మానము, ప్రవాసము, శాపము అని విప్రలంభమునకు అయిదుహేతువులు గలవు.
ఆయోగవిప్రలంభశృంగారలక్షణం
| ప్రాగసంగత యోర్యూనోరనురాగే౽పి జాగ్రతి. | 293 |
| అయోగః పారతంత్రాద్యైర్విప్రలంభో౽భిలాషజః, | 294 |