| దధ్యాదివ్యంజనైశ్చించామరిచ్యాదిభిరౌషధైః, | 279 |
| యథాపాకవిభేదైశ్చ నిష్పాద్యో రస ఔదనః, | 280 |
| సో౽యమానందసంభేదో భావజ్ఞైరనుభూయతే, | |
యథాయోగ్యముగఁ గూడిన పెరుగు మొదలైనవ్యంజనములచేతను, చింతపండు మిర్యాలు మొదలయిన యౌషధములచేతను, బెల్లము మొదలయిన మధురపదార్థములచేతను, పాకభేదములచేతను, అన్నమునకు రస మెట్లు కలుగుచున్నదో అట్లు విభావాదిభావములచేతను, ప్రయోగముచేతను, రసము నిష్పన్న మగుచున్నది. రసమనునది మనస్సుచే నెఱుఁగఁదగిన సుఖవిశేషము. అది భావజ్ఞులచే ఆస్వాదింపఁబడుచున్నది.
రసభేదానాహ
| శృంగారవీరకరుణాద్భుతహాస్యభయానకాః. | 281 |
| భీభత్సశ్చ తథా రౌద్రో నాప్యే త్వష్టరసాః స్మృతాః, | |
శృంగారము, వీరము, కరుణము, అద్భుతము, హాస్యము, భయానకము, భీభత్సము, రౌద్రము - అని నాట్యమందు ఎనిమిదిరసములు చెప్పఁబడుచున్నవి.
శృంగారరసలక్షణం
| రసేషు తత్ర శృంగారః ప్రథమం వక్ష్యతే స్ఫుటం. | 282 |
| విభావై రనుభావైశ్చ సాత్వికై వ్వ్యభిచారిభిః, | 283 |
| నాయికా నాయకో వాపి తత్ర చాలంబనం మిథః, | 284 |