పుట:భరతరసప్రకరణము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జుగుప్సాస్థాయిలక్షణం

అహృద్యానాం పదార్థానాం దర్శనశ్రవణాదిభిః.

264


మనస్సంకోచనం యత్సా జుగుప్సా తత్ర విక్రియాః,
నాసాపిధానం త్వరితా గతిరాస్యవికూణనం.

265


సర్వాంగధూననం కుత్సా ముహుర్నిష్ఠీవనాదయః,

అయోగ్యవస్తువులను జూచుట వినుట మొదలైనవానిచేఁ గలుగు మనస్సంకోచము జుగుప్సాస్థాయి యనఁబడును. ముక్కు మూసికొనుట, వేగముగఁ బోవుట, ముఖమును వంకర చేసికొనుట, సర్వాంగధూననము, అసహ్యపడుట, మాటిమాటికి ఉమ్మివేయుట మొదలైనవి గలుగును.

క్రోధస్థాయిలక్షణం

భవేత్ప్రజ్వలనం క్రోధః పురాక్షేపాదిసంభవః.

266


ఫుల్లనాసాపుటోద్వృత్త తారకాద్యనుభావయుక్,
శత్రుభృత్యసుహృత్పూజ్యాశ్చత్వారో విషయా మతాః.

267

పురాక్షేపాదులచేఁ గలుగు మనఃప్రజ్వలనము క్రోధస్థాయి యనఁబడును. ఇది ఫుల్లనాసాపుటము, గిరగిరతిరుగు నల్లగ్రుడ్లు, మొదలైన అనుభావములను గలదై యుండును. దీనికి శత్రువులు, భృత్యులు, స్నేహితులు, పూజ్యులు, ఈనలుగురు విషయు లనఁబడుదురు.

శత్రువిషయక్రోధో యథా

ముహుర్దష్టోష్ఠతా భంగో భ్రుకుట్యా దంతఘట్టనం,
హస్తనిష్పీడనం గాత్రప్రకంపో౽స్త్రస్య వీక్షణం.

268


స్వభుజావేక్షణం కంఠగర్జాద్యాశ్శాత్రవక్రుధి,

శత్రు విషయక్రోధమందు అడుగడుగునకు పెదవులు కొఱుకుకొనుట, కనుబొమలు వంకరయవుట, పండ్లు కొఱుకుట, చేతులను పిసుకుకొనుట, దేహమువణఁ