| క్రియాస్తత్రాక్షివిస్తారో సాధూక్తిపులకాదయః, | |
లోకోత్తరమైనపదార్థములను అపూర్వముగఁ జూచుట, వీనిచేఁ గలుగు మనోవిస్తారము విస్మయస్థాయి యనఁబడును. ఇందు నేత్రవైశాల్యము, శ్లాఘించుట, పులకరింపు మొదలైనక్రియలు గలవు.
హాసస్థాయిలక్షణం
| భాషణాకృతివేషాణాం క్రియాయాశ్చ వికారతః. | 260 |
| తౌల్యాదేవ పరస్థానా మేషామనుకృతేరపి, | 261 |
| దృష్టేర్వికాసో నాసోష్ఠకపోలస్పందనాదయః, | |
పలుకులు ఆకారము వేషము పని వీనివికారముచేతను, ఇవి పరస్థలవాసులవైనయెడ సహజముగా నుండినను, వెక్కిరించుటచేతను, గలుగు మనోవికారము హాసస్థాయి యనఁబడును. ఇందు వికారపుచూపు, ముక్కు పెదవి చెక్కిళ్లు వీనికదలిక మొదలైనవి గలుగును.
భయస్థాయిలక్షణం
| భయం తు మంతునా ఘోరదర్శనశ్రవణాదిభిః. | 262 |
| చిత్తస్యాతీవ చాంచల్యం తత్ప్రాయో నీచమధ్యయోః, | 263 |
| అనుభావ్యో భవేత్కంపముఖసంశోషణాదిభిః, | |
ఆకస్మికముగా భయంకరవస్తువులను జూచుట వినుట మొదలైనవానిచేతను, తప్పిదముచేతను గలుగు మిక్కిలిచిత్తచాంచల్యము భయస్థాయి యనఁబడును. ఇది ఉత్తమ మధ్యమ నీచాశ్రయమై ముత్తెఱఁగు లౌను. దీనిని వణఁకుట, ముఖము వాడుట, మొదలైనవానిచే నెఱుఁగవచ్చును.