పుట:భరతరసప్రకరణము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరుసగ మొలక, చిగురు, మొగ్గ, పుష్పము, ఫలమును నగురతిస్థాయిభావము ప్రేమయని, మానమని, ప్రణయమని, స్నేహమని, రాగమని, అనురాగమని ఈపేళ్లను బొందుచున్నది.

ప్రేమలక్షణం

స ప్రేమా ప్రేమసహితం యూనోర్యద్భావబంధనం.

248

నాయికానాయకుల ప్రీతిసహితమైన మనస్సులకలయిక ప్రేమ యనఁబడును.

మానలక్షణం

యత్తు ప్రేమానుబంధేన స్వాతంత్ర్యాద్ధృదయంగమం,
బధ్నాతి భావకౌటిల్యం స మాన ఇతి గీయతే.

244

నాయికానాయకులకు ప్రేమబంధముచేత స్వాతంత్ర్యమువలనఁ గలుగు భావకౌటిల్యము మాన మనఁబడును.

ప్రణయలక్షణం

బాహ్యాంతరోపచారైర్యత్ప్రేమ మానోపకల్పితైః,
బధ్నాతి భావవిస్రంభం సో౽యం ప్రణయ ఉచ్యతే.

245

నాయికానాయకులమానోపకల్పితములైన బాహ్యాంతరోపచారములచేత భావవిస్రంభమును గలుగఁజేయుప్రేమ ప్రణయ మనఁబడును.

స్నేహలక్షణం

విస్రంభే పరమాం కాష్ఠామారూఢే దర్శనాదిభిః,
యత్ర ద్రవత్యంతరంగం స స్నేహ ఇతి కథ్యతే.

246


స త్రేధా కథ్యతే ప్రౌఢమందమధ్యమభేదతః,

నాయికానాయకులవిస్రంభము చూపు మొదలయినవానిచేత పూర్ణము కాఁగా ఏదశయందు మనసు కఱగుచున్నదో యది స్నేహ మనఁబడురు. ఆస్నే