మత్తకుంజరదర్శనావేగో యథా
| ఆవేగే కుంజరోద్భూతే సత్వరం వాపసర్పణం, | 184 |
ఏనుఁగుచేఁ గలుగు నావేగమందు త్వరగా పరుగెత్తిపోవుట, ప్రక్కకు తిరిగి తిరిగిచూచుట, భయము, వణకు మొదలైనవి గలుగును.
ప్రియశ్రవణజావేగో యథా
| ప్రియశ్రవణజే౽ప్యస్మిన్నభ్యుత్థానోపగూహనే, | 185 |
ఈప్రియశ్రవణజావేగమందు అభ్యుత్థానము, ఆలింగనము జేసికొనుట, ప్రీతిపురస్సరముగ వస్త్రాభరణాదుల నిచ్చుట, ప్రియమైన వాక్యము, రోమాంచము మొదలైనవి గలుగును.
అప్రియశ్రవణావేగో యథా
.
| అప్రియశ్రుతిజే౽ప్యస్మిన్విలాపః పరిలుంఠనం, | 186 |
అప్రియశ్రవణావేగమందు ఏడుపు, పొరలాడుట, మొరపెట్టుట, క్రిందఁబడుట, అంతటఁ దిరుగుట మొదలైనవి గలుగును.
శాత్రవవ్యసనావేగో యథా
| చేష్టాస్స్యుశ్శాత్రవావేగే వర్మశస్త్రాదిధారణం, | 187 |
| ఏతే స్యురుత్తమాదీనామనుభావా యథోచితం, | |
శాత్రవావేగమందు కవచము ఆయుధము మొదలైనవస్తువులను ధరించుట, ఏనుఁగు గుఱ్ఱము రథము వీని నెక్కుట, త్వరగా విక్రమించుట మొదలైనవి గలుగును. ఇవి ఉత్తమాదులకు యథోచితముగఁ గలుగును.