మద మనునది మద్యము మొదలయినవానిచేఁ గలుగు ఆనందసమ్మోహములయొక్క సంభ్రమము. ఆమదము తరుణమదమనియు, మధ్యమదమనియు, అపకృష్టమదమనియు మూఁడువిధములు.
| దృష్టిః స్మేరా ముఖే రాగః సస్మితాకులితం వచః, | 157 |
తరుణమదమందు గర్వపుఁజూపులు, ముఖమందు ఎఱుపు, చిఱునగవును సంభ్రమమును గలపలుకు, ఒయారపునడక, ఇవి మొదలయిన చేష్టలు కలుగును.
| మధ్యమే తు మదే వాచి స్ఖలనం ఘూర్ణనం దృశోః, | 158 |
మధ్యమమదమందు వాక్కున తడఁబాటు, గ్రుడ్లు తిరుగుట, వంకరగ నడచుట, చేతుల నాడించుట, వ్రేలవేయుట, మొదలయిన చేష్టలు గలవు.
| అపకృష్టే తు చేష్టాస్స్యుర్గతిభంగో విసంజ్ఞతా, | 159 |
అపకృష్ణమదమందు గతిభంగము, మూర్ఛిల్లుట, తెలివితప్పియుండుట, ఉమియుట, వెక్కిళ్లు, వాంతి మొదలయిన చేష్టలు గలుగును.
| ఉత్తమప్రకృతిశ్శేతే మధ్యో హసతి గాయతి, | 160 |
ఉత్తమమదమును గలవాఁడు పండుకొనియుండును. మధ్యమమదమును గలవాఁడు నవ్వుచుఁ బాడుచునుండును. అధమమదమును గలవాఁడు క్రూరముగను వికారముగను మాటలాడుచును దుఃఖించుచునుండును.
శ్రమలక్షణం
| శ్రమో మానసఖేదస్స్యాదధ్వనృత్తరతాదిభిః, | 161 |