| ద్వివిధా చేయమాత్మోత్థాపరోత్థా చేతి భేదతః. | 151 |
| స్వకార్యజనితా స్వోత్థా ప్రాయో వ్యంగ్యేయమింగితైః, | 152 |
| పరోత్థా తు పరస్వేదః పరస్యాకారతో భవేత్, | 153 |
| ఆకారస్సాత్వికశ్చేష్టా స్త్వంగప్రత్యంగజాః క్రియాః, | |
ఈశంక ఆత్మోత్థశంక యనియు, పరోత్థశంక యనియు నిరుదెఱఁగు లౌను. స్వకార్యమువలన కలుగునది స్వోత్థశంక. ఇందుఁగల ఇంగితములు ఱెప్ప, కనుబొమలు, నల్లగ్రుడ్లు, చూపు వీనియందు గలుగువికారములు. ఇతరుల ఆకారమువలన గలుగు చెమట పరోత్థశంక యనఁబడును. వరుసగా నాకారచేష్టాదులచే నీరెండువిధముల శంకను నూహింపవచ్చును. ఆకారము, సాత్వికము, చేష్టలు అంగప్రత్యంగములయుదు గలుగు క్రియాభేదములు.
అసూయాలక్షణం
| పరసౌభాగ్యసంపత్తివిద్యాశౌర్యాదిహేతుభిః. | 154 |
| గుణే౽పి దోషారోపస్స్యాదసూయా తత్ర విక్రియాః, | 155 |
ఇతరుల సౌభాగ్యము, సంపత్తి, విద్య, శౌర్యము, మొదలగు హేతువులచే గుణమందుఁ గూడ దోషారోపణము చేయుట అసూయ యనఁబడును. ఇందు మోమును ద్రిప్పుట, నిందించుట, భ్రూభేదము, ఉపేక్ష ఇవి మొదలయినక్రియలు గలవు.
మదలక్షణం
| మదస్త్వానందసమ్మోహసంభ్రమో మదిరాదిజః, | 156 |