సర్వావస్థలయందు ననుసరించినవినయమును ఔదార్యమని చెప్పుదురు.
అథ గాత్రజానుభావా నిరూప్యంతే
| | లీలా విలాసో విచ్ఛి త్తిః విభ్రమః కిలికించితం, | 110 |
| | విహృతం చేతి విజ్ఞేయాః స్త్రీణాం తు దశ గాత్రజాః, | |
లీల, విలాసము, విచ్ఛిత్తి, విభ్రమము, కిలికించితము, మోట్టాయితము, కుట్టమితము, బిబ్బోకము, లలితము, విహృతము ఈపదియు స్త్రీల గాత్రాజానుభావము లనఁబడును.
లీలాలక్షణం
| | ప్రియానుసరణం యత్తు మధురాలాపపూర్వకైః. | 111 |
| | చేష్టితైర్గతిభిశ్చాపి సా లీలేతి నిగద్యతే, | |
మధురాలాపము మొదలైనచేష్టలచే నాయకుని ననుసరించుట లీల యనఁబడును.
విలాసలక్షణం
| | ప్రియసంప్రాఫ్తిసమయే భ్రూనేత్రాననకర్మభిః. | 112 |
| | తాత్కాలికో విశేషో యః స విలాస ఇతీరితః, | |
నాయకుఁడు వచ్చెడిసమయమందు కనుబొమలు, కన్నులు, ముఖము వీనిచే నప్పుడు గలుగువిశేష మేదో యది విలాస మనఁబడును.
విచ్ఛిత్తిలక్షణం
| | ఆకల్పకల్పనాకల్పా విచ్ఛిత్తిరతికాంతికృత్. | 113 |
అలంకారవిన్యాసములకు సమానమై మెరయుచునుండునది విచ్ఛిత్తి యనఁబడును.