ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రూపభూషాదులచే దేహము నలంకరించుకొనుట శోభ యనఁబడును.
కాంతి లక్షణం
| శోభైవ కాంతిరాఖ్యాతా మన్మథాప్యాయనోజ్వలా. | 106 |
ఆశోభయే మన్మథవిషయతృప్తిఁ జేయుటయందు ప్రకాశించెనేని యది కాంతి యనఁబడును.
దీప్తిలక్షణం
| కాంతిరేవ వయోభోగదేశకాలగుణాదిభిః, | 107 |
ఆకాంతియే వయోభోగదేశకాలగుణాదులచే మిక్కిలియధిక మాయెనేని యది దీప్తి యనఁబడును.
ప్రాగల్భ్యలక్షణము
| నిశ్శంకత్వం ప్రయోగేషు ప్రాగల్భ్యం పరికీర్తితం, | |
ప్రయోగములయందు నిశ్శంకవృత్తి ప్రాగల్భ్య మనఁబడును.
మాధుర్యలక్షణము
| మాధుర్యం నామ చేష్టానాం సర్వావస్థాసు మార్దవం. | 108 |
సర్వావస్థలయందును వ్యాపారములయొక్క మృదుత్వమే మాధుర్య మనఁబడును.
ధైర్యలక్షణము
| స్థిరా చితోన్నతిర్యాతు తద్ధైర్యమితి సంజ్ఞితం, | |
దృఢమైన చిత్తవృత్తి ధైర్య మనఁబడురు.
ఔదార్యలక్షణము
| ఔదార్యం వినయం ప్రాహుః సర్వావస్థానుగం బుధాః. | 109 |