పుట:భరతరసప్రకరణము.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములు, వాగారంభానుభావములు, బుద్ధ్యారంభానుభావములు అని నలుదెఱఁగు లౌను.

చిత్తజానుభావా లక్ష్యంతే

తత్ర చ భావో హావో హేలా శోభా చ కాంతిదీప్తీ చ,
ప్రాగల్భ్యం మాధుర్యం ధైర్యౌదార్యేచ చిత్తజా భావాః.

103

ఆనలుదెఱంగుల అనుభావములయందు భావము, హావము, హేల, శోభ, కాంతి, దీప్తి, ప్రాగల్భ్యము, మాధుర్యము, ధైర్యము, ఔదార్యము ఇవి చిత్తజానుభావము లనఁబడును.

భావలక్షణం

నిర్వికారస్య చిత్తస్య భావస్స్యాద్యా తు విక్రియా,
గ్రీవారేచకసంయుక్తో భ్రూనేత్రాదివిలాసకృత్.

104

వికారములేని మనసుయొక్క విక్రియ భావ మనఁబడును. అది గ్రీవారేచకసంయుక్తమై భ్రూనేత్రాదులయందు వికాసమును గలుగఁజేయును.

హావలక్షణం

భావ ఈషత్ప్రకాశో యః స హావ ఇతి కథ్యతే,

ఆభావము నేత్రాదులవలన నించుక ప్రకాశపడెనేని యది హావ మనఁబడును.

హేలాలక్షణం

భావ ఏవ భవేద్దేలా లలితాభినయాత్మికః.

105

ఆభావమే లలితాభినయరూప మగునపుడు హేల యనఁబడును.

శోభాలక్షణం

సా శోభా రూపభూషాద్యైర్యత్స్యాదంగవిభూషణం,