యౌవనవ్యాప్తిచేత గలుగు కడకంటిచూపులు మొదలైనవి చేష్టలు.
అలంకృతిర్యథా
| చతుర్థాలంకృతిర్వాసోభూషామాల్యానులేపనైః. | 98 |
అలంకృతి వస్త్రములు, భూషణములు, పుష్పములు, మైపూతలు ఈ విధములచే నలుదెఱఁగు లౌను.
తటస్థాయథా
| తటస్థాశ్చంద్రికాధారగృహచంద్రోదయాదయః, | 99 |
| లతామంటపభూగేహదీర్ఘికాజలదారవాః, | 100 |
| ఏవమూహ్యా యథాకాలముపభోగోపయోగినః, | |
చంద్రికాధారము లైన గృహములు, చంద్రోదయము మొదలైనవి, కోవెలలు నిండియుండురసాలవృక్షము, మందమారుతము, భ్రమరములు, పొదరిండ్లు, భూగేహము, దీర్ఘికలు, మేఘనాదము, ప్రాసాదమధ్యము, సంగీతము, క్రీడాదులు, సెలయేఱులు మొదలైనవి ఉపభోగోపయోగవస్తువులు తటస్థోద్దీపనములు - ఇవి కాలోచితములుగ నూహించుకోవలసినవి.
అథ అనుభావలక్షణం
| భావం మనోగతం సాక్షాత్స్వహేతుం వ్యంజయంతియే. | 101 |
| తే౽నుభావా ఇతి ఖ్యాతా భ్రూవిక్షేపస్మితాదయః, | 102 |
స్వహేతువైన మనోగతాభిప్రాయమును ప్రత్యక్షమువలెనే బయలుపఱచునవి యనుభావములు. ఇవి చిత్తజానుభావములు, గాత్రజానుభావ