Jump to content

పుట:భరతరసప్రకరణము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

అభినయశాస్త్రమందు దీనికి గావలసినహ స్తములు మొదలయినవి చెప్పఁబడియున్నవి. వాని నభినయమునఁ జూపునపుడు భావములను తదనుగుణముగాఁ జూపవలయును కాఁబట్టి అభినయించువారికిని దాని జూచి యానందించువారికిని భావజ్ఞాన మావశ్యము కావున శృంగారఅలంకారశాస్త్రముల ననేకముల శోధించి వానియందు ముఖ్యములయిన సాహిత్యచింతామణి, ప్రతాపరుద్రీయము, రసార్ణవసుధాకరము మొదలయిన గ్రంథములనుండి ముఖ్యమైన విషయముల నెత్తికూర్చి వానికి తెలుఁగున అర్థము వ్రాసి భరతరసప్రకరణం బనుపేర ఈగ్రంథమును బ్రచురించితిమి. శృంగారరసము దానిభావములు మొదలగువానిని విచారించువారికిని, భరతవిద్యను విచారించువారికిని యిది మిక్కిలి యుపయుక్తము. అభినయవిషయములను దెలుపు అభినయదర్పణమను గ్రంథము పూర్వమే ముద్రింపఁబడియున్నది. ఈగ్రంథమునను యితరఅలంకారగ్రంథములయందుండు నాయికానాయకరసవ్యభిచారిభావాలంకారసహితము లగు కొన్నిపదములు రాజమన్నారుగుడిలోనుండు భరతవిద్యాప్రవీణులగు శ్రీసభాపతయ్యగారిచే రచింపఁబడినవి ముద్రింపఁబడియున్నవి.