Jump to content

పుట:భరతరసప్రకరణము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకాశమువలన మనోహరమైన దేహము గలదిగాను వెలయుచుండు భావసౌరభము గలదిగాను, వృద్ధిబొందు మొలకచన్నులు గలదిగాను, చక్కగా నేర్పడని ఆంగములసంధులు గలదిగాను ఉండునది ప్రథమయావన మనఁబడును. ఈయౌవనముగలనాయిక మృదుస్పర్శము నపేక్షించును. ఉచ్చరతిని సహింపదు. సఖులతో నాడుటయందు ప్రియము. తన్ను తా నలంకరించుకొనుటయందు. ప్రియము. సవతిని జూచుట మొదలైన కార్యములందు కోపసంతోషములు లేనిదిగా నుండుట, ప్రియునియందు అధికముసిగ్గు లేకుండుట, రతియందు భయము ఈగుణములు గలిగి యుండును.

ద్వితీయయౌవనలక్షణం

స్తనౌ పీనౌ తనుర్మధ్యః పాదే పాణౌ చ రక్తిమా.

82


ఊరూ కరికరాకారౌ అంగం వ్యక్తాంగసంధికం,
నితంబో విపులో నాభిర్గంభీరా జఘనం ఘనం.

83


వ్యక్తరోమావళిస్నైగ్ధ్యమంగప్రత్యంగసౌష్ఠవం,
ద్వితీయం యౌవనం తత్ర వర్తమానా సులోచనా.

84


సఖీషు స్వాశయజ్ఞాసు స్నిగ్ధా ప్రాయేణ భామినీ,
న ప్రసీదత్యనునయైస్సపత్నీష్వభ్యసూయినీ.

85


నాపరాధాన్విషహతే ప్రణయేర్ష్యాకషాయితా,
రతికేళిష్వనిభృతా చేష్టతే గర్వితా రహః.

86

గొప్పచన్నులును, సన్నమైననడుమును, ఎఱుపుగల చేతులు కాళ్లును, ఏనుఁగుతొండమువంటి తొడలును, వ్యక్తాంగసంధియగు దేహమును, విపులమైన నితంబమును, గంభీరమైన నాభియు, ఘనమయిన జఘనప్రదేశమును, ప్రకాశమైన రోమావళినిగనిగయును. అంగప్రత్యంగముల చక్కఁదనమును గలదై యుండునది ద్వితీయయౌవన మనఁబడును. ఈయౌవనము గలనాయిక తన మనోభావము తెలిసిన సఖులయందు తరుచుగా ప్రీతికలదిగాను, సమాధా