అథ శృంగారనాయకా నిరూప్యంతే
| పతిశ్చోపపతిశ్చైవ వైశికశ్చ తతఃపరం, | 64 |
పతి, ఉపపతి, వైశికుఁడు, అనువీరు - స్వీయా, పరకీయా, సామాన్యలకు నాయకులని చెప్పఁబడుదురు.
పతిలక్షణం
| వేదశాస్త్రానురోధేన పాణిం గృహ్ణాతి యః స్త్రియః, | 65 |
ఏపురుషుఁడు వేదశాస్త్రోక్తముగ ఏస్త్రీని పాణిగ్రహణము చేసికొనుచున్నాఁడో ఆమెకు వాఁడే భర్తయని విద్వాంసులు శాస్త్రమందు చెప్పియున్నారు.
ఉపపతిలక్షణం
| ప్రలోభ్యాన్యవధూం భుఙ్క్తే ఉపాయైర్వివిధైరపి, | 66 |
అన్యవనితను వివిధోపాయములచే నాసపఱచి అనుభవించునతఁడు ఉపపతి యనఁబడును.
వైశికలక్షణం
| వేశ్యాబహుళసంభోగసమాసాదితగౌరవః, | 67 |
ఎవఁడు వేశ్యోపభోగములచే పొందఁబడిన గౌరవముగలవాఁడును, అర్థవ్యయము చేయువాఁడును, విలాసముగలవాఁడు నైయుండునో వాఁడు వైశికుఁడని చెప్పఁబడును.