అధమనాయికాలక్షణం
| కఅస్మాత్కుప్యతి రుషం ప్రార్థితాపి న ముంచతి, | 59 |
| స్థవిరం తరుణం వాపి యా వా కామయతే ద్రుతం, | 60 |
ఏనాయిక అకారణముగ కోపించుచున్నదో, ప్రార్థించినను కోపమును విడువదో, చక్కనివాఁడైనను, అరూపుఁడైనను, గుణవంతుఁడైనను, అగుణవంతుఁడైనను, ముసలివాఁడైనను, తరుణుఁడైనను, ఎట్లున్నను నాయకుని నిచ్ఛించుచున్నదో ఈర్ష్య, కోపము, వ్యసనము వీనిని గలదిగ నున్నదో, యది యధమనాయిక యనఁబడును.
నాయికాసంఖ్యాప్రకరణం
| స్వీయా త్రయోదశవిధా ద్వివిధా చ పరాంగనా, | 61 |
| ప్రత్యేక మష్టథా తాసాముత్తమాదిప్రభేదతః, | 62 |
స్వీయ 13 విధములు గలదియు, పరకీయ 2 విధములు గలదియు, సామాన్య 1 విధము గలదియు నగును. ఈ 16 విధములుగల నాయికలకు ప్రత్యేకము ఎనిమిది యవస్థలు గలుగుటవలన నూటయిరువదిభేదములు గలవారగుదురు. వీరలు మరల ఉత్తమాదిభేదము వలన 34 భేదములు గలవారగుదురు.
అసాం దూత్యాదయో నిరూప్యంతే
| దూతీ దాసీ సఖీ చేటీ ధాత్రేయీ ప్రాతివేశినీ, | 63 |
ఈనాయికలకు సహాయపడువారు దూతి దాసి సఖి చేటి ధాత్రేయి ప్రాతివేశిని లింగిని శిల్పిని వీరు మొదలయినవారు.