చున్నది గాని, తానే నాయకునిస్థలమునకుఁ బోవుచున్నది గాని, అభిసారిక యనఁబడును. దీనివ్యాపారములు సంతాపపడుట, చింత మొదలైనవి, యాయాసమయోచితముగ నుండును.
| ఏతాసాం నాయికానాం తు త్రైవిధ్యం పరికీర్తితం, | 55 |
ముందు చెప్పిన 128 భేదములుగలనాయికలు, ఉత్తమ, మధ్యమ, ‘అధమ యనుభేదములచేత మూఁడువిధములు గలవారగుదురు.
ఉత్తమాలక్షణం
.
| విదధత్యప్రియం పత్యౌ ప్రియమాచరతి స్వయం, | 56 |
నాయకుఁడు అహితముఁ జేయుచుండఁగ నతనికి ప్రియముగా నేపె నడచుచున్నదో, అపరాధియగు వల్లభుని చూచి యేపె ఊరకయున్నదో, ఆపె ఉత్తమనాయిక.
మధ్యమనాయికాలక్షణం
| పుంసి స్వయం కామయతి కామయేద్యా చ తం వధూః, | 57 |
| సాపరాధే౽పకర్త్రీ స్యాత్ స్నిగ్ధే స్నిహ్యతి వల్లభే, | 58 |
నాయకుఁడు ఇచ్ఛించిన తా నిచ్ఛించుట, అతఁడు కోపించుకొనిన తాను కోపించుట, అతఁడు నిజము పలికిన తాను నిజము పలుకుట, అతఁ దపరాధము చేసిన తా నపవాధము సేయుట, అతఁడు స్నేహించిన తాను స్నేహించుట, ఈరీతిగుణములు గలది మధ్యమనాయిక యనఁబడును.