| పరకీయేతి సా ప్రోక్తా భరతాగమవేదిభిః, | 31 |
పరపురుషునియందుఁగల ఇచ్ఛావ్యాపారములను మఱుగుపఱుచుటయందు దత్తచిత్తురాలై యున్ననాయిక పరకీయ యనఁబడును. అది కన్య యనియు, పరోఢ యనియు, ఇరుదెఱంగులు గలిగియుండును.
పరకీయాకన్యాలక్షణం
| కన్యా త్వనూఢా యువతిస్సలజ్జా పితృపాలితా, | 32 |
చతురయుగాను, యౌవనమధ్యస్థయుగాను, సిగ్గుగలదిగాను, దండ్రులచే పోషితగాను, చెలులతోడి విహారములయందు ప్రియురాలుగాను, ప్రియునియందు ముగ్ధగుణము గలదిగాను నుండునది పరకీయకన్య.
పరకీయాపరోఢాలక్షణం
| పరోఢా తు ప్రియేణోఢాప్యన్యసంగమలాలసా, | 33 |
ప్రియునిచే పెండ్లియాడఁబడినదిగాను, పెనిమిటిమనస్సునకు సరియైననడతలు గలదిగాను, గృహకృత్యములందు సమర్థురాలుగాను, ఉండియును పరపురుషసంగమమం దాసక్తిగలదిగా నుండునది పరోఢ యనఁబడును.
సామాన్యానాయికాలక్షణం
| సామాన్యా సైవ గణికా కలాప్రాగల్భ్యదార్ష్ట్యయుక్, | 34 |
| ఏతస్యా నాను రాగస్స్యాద్గుణవత్యపి నాయకే, | 35 |