ప్రగల్భా అధీరా యథా
| సంతర్జయత్యరం రోషాదధీరా తాడయేతియం, | |
అపరాధియగు నాయకుని మిక్కిలి బెదరించికొట్టునది ప్రగల్భాధీరానాయిక యనఁబడును.
ప్రగల్భాధీరాధీరానాయికా యథా
| ధీరాధీరగుణోపేతా ధీరాధిరేతి కథ్యతే. | 27 |
| ఏతే జ్యేష్టా కనిష్టేతి భేదతో ద్వివిధే మతే, | |
అపరాధియగు నాయకునియందు రతివ్యాపారములో ఉపేక్షయు, బెదిరింపు, తిట్లు, కొట్లునుంగలది, ప్రగల్భాధీరాధీరానాయిక యని చెప్పఁబడును. ముందు చెప్పిన మధ్యాప్రగల్భలలోఁగల భేదమునొందిననాయికలు జ్యేష్ఠ కనిష్ఠ అనుభేదమువలన ఇరుదెఱంగు లగుదురు.
జ్యేష్ఠాకనిష్ఠాలక్షణం
| ప్రియాధికప్రేమపాత్రం జ్యేష్ఠ సా తు నిగద్యతే. | 28 |
| న్యూనవిస్రంభపాత్రం చేత్కనిష్ఠా సా ప్రకీర్తితా, | 29 |
| ఏవం త్రయోదశవిధా స్వీయా సా పరికీర్తితా. | |
నాయకునికి ఎవతెయందు ప్రేమ అధికముగా నుండునో ఆమె జ్యేష్ఠ యనఁబడును. తక్కువప్రేమ ఎవతెయం దుండునో ఆమె కనిష్ఠ యనఁబడును. మధ్యాప్రగల్భానాయికలు పండ్రెండువిధములు గలవారని యు, ముగ్ధ ఏకవిధము గలదనియుఁ జెప్పఁబడుచున్నది. ఈ చెప్పిన ప్రకారము మొదటఁ జెప్పఁబడిన స్వీయ పదమూఁడువిధము లగుచున్నది.
పరకీయాలక్షణం
| పరానురాగవ్యాపారగోపనే దత్తమానసా. | 30 |