పుట:భరతరసప్రకరణము.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానమని చెప్పఁబడును. ఆమానము లఘుమాన మనియును, మధ్యమాన మనియును, గురుమాన మనియును, మూఁడుతెఱగులు గలిగియుండును.

లఘుమానలక్షణం

అన్యస్త్రీదర్శనాదిభ్యో లఘుమానః ప్రజాయతే,
వాగాద్యల్పైరసౌ మానస్త్వపనేయః ప్రకీర్తితః.

20

అన్యస్త్రీదర్శనము మొదలైనవానివలన గలుగుకోపము లఘుమాన మనఁబడును. ఇది మంచిమాటలు మొదలయినవానిచే తొలఁగింపఁబడును.

మధ్యమానలక్షణం

మధ్యమానస్త్వథాన్యస్యా నామగ్రహణతో భవేత్,
ఏష మానో౽పనేతవ్యశ్శపథాద్యనువర్తనైః.

21

నాయకునితోడి సరససల్లాపకాలమందు అన్యస్త్రీపేరు చెప్పుటవలన గలుగు మనోవ్యాపారము మధ్యమాన మనఁబడును. ఈమానము ప్రమాణము చేయుట మొదలగు అనుసరణములచేత తొలఁగింపఁబడును.

గురుమానలక్షణం

అన్యాసంగమచిహ్నాద్యైర్గురుమానః ప్రజాయతే,
పాదప్రణామానునయైరపనేయో భవేదసౌ.

22

అన్యస్త్రీసంభోగపుగుఱుతులు మొదలైనవానివలన గలుగు చిత్తావేగము గురుమాన మనఁబడును. ఈమానము నమస్కరించుట అనునయించుట మొదలైనవానిచే తొలఁగింపఁబడును.

మధ్యాధీరాలక్షణం

ధీరా తు వక్తి వక్రోక్త్యా సోత్ప్రాసం సాగసం ప్రియం,

అపరాధియైయుండు నాయకుని జూచి సాభిప్రాయమైన వంకరమాట లాడునది మధ్యాధీరానాయిక యని చెప్పఁబడును.